ENG vs IND : శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు.. ఇంగ్లాండ్‌లో టీమ్ఇండియా ఓడిపోతే..
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

Ravi Shastri Sends Request To BCCI over Shubman Gill Captaincy
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత ఆ బాధ్యతలను శుభ్‌మన్ గిల్ చేపట్టిన సంగతి తెలిసిందే. అతడి కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన భారత్ ఓటమితో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ప్రారంభించింది. రెండో మ్యాచ్ జూలై 2న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది.
కాగా.. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఫలితం ఎలా ఉన్నా సరే గిల్‌ను కెప్టెన్‌గానే కొనసాగించాలని టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మేనేజ్‌మెంట్‌ను కోరాడు. మరో మూడు సంవత్సరాల పాటు అతడే నాయకుడిగా ఉంచాలని సూచించాడు. అప్పుడే గిల్ అద్భుతంగా రాణిస్తాడని చెప్పుకొచ్చాడు.
WI vs AUS : వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ బిగ్‌షాక్..
కెప్టెన్ అయిన తరువాత అతడిలో మార్పు చాలా స్పష్టం కనిపిస్తోందన్నాడు. మీడియా సమావేశాల్లో, టాస్ వేసే సమయంలో అతడు ఎంతో పరిణితిని ప్రదర్శిస్తున్నాడని తెలిపాడు. గొప్ప క్రికెటర్‌గా మారడానికి కావాల్సిన అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయన్నారు. అతడు పరిస్థితులకు అనుగుణంగా తన ఆట తీరును మార్చుకుంటే గొప్ప బ్యాటర్‌గా రాణిస్తాడని చెప్పుకొచ్చాడు.
కాగా.. తొలి టెస్టులో బ్యాటర్‌గా గిల్ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో రాణించాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువగా పరుగులు చేయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోవడంతో గిల్ కెప్టెన్సీ పై పలువురు సందేహాలు లేవనెత్తారు. ఈ క్రమంలో గిల్‌కు రవిశాస్త్రి మద్దతుగా నిలిచారు.