Firozpur Batter dies on pitch due to heart attack after hitting six
క్రికెట్ మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టి ఆ వెంటనే మరణించిన హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
హర్జీత్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలసి ఫిరోజ్‌పూర్‌లోని డిఎవి స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు. బౌలర్ వేసిన బంతిని హర్జీత్ సింగ్ భారీ సిక్స్‌గా మలిచి తన జట్టులో జోష్‌లో నింపాడు. అతడు పిచ్ మధ్యలోకి వచ్చి మోకాళ్ల కూర్చున్నాడు. అదే సమయంలో నాన్ స్ట్రైకర్ బ్యాటర్ సైతం అతడి వద్దకు వచ్చాడు. అతడు చూస్తుండగానే హర్జీత్ కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
ख़ौफ़नाक दृश्य।
पंजाब के फिरोजपुर में क्रिकेट खेलते वक़्त एक खिलाड़ी ने जैसे ही ज़बरदस्त छक्का मारा,
अचानक दिल का दौरा पड़ा और उसी मैदान पर दम तोड़ दिया।ज़िंदगी वाकई पल भर की मेहमान है… 🕯️#Firozpur #HeartAttack #Cricketer pic.twitter.com/AsM3evT01T
— Ankit Rajput (@AnkitKu50823807) June 29, 2025
అతడు కిందపడిపోవడాన్ని చూసిన మిగిలిన వాళ్లు వెంటనే అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం సైతం చేశారు. అయితే.. ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అతడు చనిపోయాడు. గుండెపోటు కారణంగానే అతడు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
గతంలో ముంబైలోనూ ఇలాంటి సంఘటననే జరిగింది. క్రికెట్ ఆడుతూ రామ్ గణేష్ తేవార్ అనే వ్యక్తి సిక్స్ కొట్టి వెంటనే కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు స్నేహితులు తెలిపారు.