Ben Stokes: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్లో మూడో ప్లేయర్..

ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. తద్వారా టెస్ట్ పార్మాట్లో ప్రపంచంలో మూడో క్రికెటర్ గా, ఇంగ్లాండ్ తొలి ఆటగాడిగా నిలిచాడు.

Ben Stokes

Ben Stokes Makes History : ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. తద్వారా టెస్ట్ ఫార్మాట్లో ప్రపంచంలో మూడో క్రికెటర్ గా, ఇంగ్లాండ్ తొలి ఆటగాడిగా నిలిచాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్ట్ మొదలైంది. స్టోక్స్ టెస్టుల్లో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ తరపున ఆరువేలకు పైగా పరుగులు సాధించడంతోపాటు, రెండు వందలకుపైగా వికెట్లు తీసిన తొలి ప్లేయర్ గా రికార్డు నమోదు చేశాడు.

Also Read : Brian Lara : లారా 400 ప‌రుగుల రికార్డును బ‌ద్ద‌లు కొట్టే భార‌త ఆట‌గాళ్ల ఎవ‌రంటే..?

వెస్టిండీస్ ఆల్ రౌండర్ గ్యారీ సోబర్స్ 93 టెస్లుల్లో 8,032 పరుగులు చేయగా.. 235 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్ 166 టెస్టుల్లో 13,289 పరుగులు చేసి 292 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తరువాత స్థానంలో బెన్ స్టోక్స్ నిలిచాడు. స్టోక్స్ వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బ్యాటర్ కిర్క్ మెకెంజీని అవుట్ చేయడంతో 200 టెస్ట్ వికెట్లు అందుకున్నాడు. ఇప్పటి వరకు స్టోక్స్ 103 టెస్టుల్లో 200 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ విభాగంలో 13 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో 35.30 సగటుతో 6,320 పరుగులు చేశాడు. టెస్టుల్లో బెన్ స్టోక్స్ అత్యుత్తమం 258 పరుగులు.

Also Read : Gautam Gambhir : గౌతమ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. ఫీల్డింగ్ కోచ్‌గా విదేశీయుడు వద్దు.. భారతీయుడే ముద్దు..!

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 121 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ జట్టు 371 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వెస్టిండీస్ జట్టు రెండోరోజు (గురువారం) ఆట ముగిసే సమయానికి 79 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ మరో 171 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ బ్యాటర్లు క్రీజులో నిలబడి 171 పరుగులు చేయడం అసాధ్యమనే చెప్పొచ్చు. దీంతో తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు