England announced playing XI for 3rd T20 match Against India
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది ఇంగ్లాండ్. ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు (మంగళవారం) రాత్రి 7 గంటలకు భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో నిలబడాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. మరో వైపు భారత్ సైతం ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం.
మొన్నటి వరకు కేవలం టెస్టు క్రికెట్‌కు మాత్రమే హెడ్ కోచ్‌గా ఉన్న మెక్‌కల్లమ్ భారత్‌తో టీ20 సిరీస్ నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి మార్గనిర్దేశ్యంలో ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో బజ్‌బాల్ క్రికెట్ ఆడుతూ ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంకెతలా ఇంగ్లాండ్ ఆడుతుందో అని అనుకుంటే తొలి రెండు మ్యాచుల్లో చిత్తైంది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్లు స్పిన్ ఆడడంలో తడబడుతున్నారు. సిన్నర్ల బౌలింగ్‌లో ఎటాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ వికెట్లు పారేసుకుంటున్నారు.
Mitchell Owen : ఎవరీ మిచెల్ ఓవెన్? 23 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు ఐపీఎల్‌కి వస్తే కోట్ల వర్షం ?
We have named an unchanged team for our third T20I v India as we look to pull one back in the series 🙌
The game will get underway at 13:30 GMT (19:00 local) in Rajkot tomorrow ⏰ pic.twitter.com/5LQJPO3s5B
— England Cricket (@englandcricket) January 27, 2025
కొనసాగుతున్న కొత్త సంప్రదాయం..
ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. మ్యాచ్‌కు ఒకరోజు ముందే తుది జట్టును ప్రకటిస్తూ వస్తోంది. అదే విధంగా మూడో టీ20 మ్యాచ్‌కు ఒక రోజు ముందు అంటే సోమవారమే తుది జట్టును ప్రకటించింది. రెండో టీ20 మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే మూడో టీ20 మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. రెండో టీ20 మ్యాచ్ ఆఖరి వరకు హోరాహోరీగా జరిగింది. గెలుపు అంచుల వరకు వచ్చి ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఈ క్రమంలోనే జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తిలక్ వర్మ (72 నాటౌట్) రాణించడంతో రెండో టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రెండో టీ20 మ్యాచులో జేమీ స్మిత్, బ్రైడన్ కార్సేలు అసాధారణ ప్రదర్శన చేశారు. దీంతో వారిద్దరిని జట్టులోనే కొనసాగిస్తోంది. మరో వైపు తొలి రెండు మ్యాచుల్లో ఫిల్ సాల్ట్, బెన్ డకెట్‌లు ఘోరంగా విఫలం అయ్యారు. సాల్ట్ వరుసగా 0, 6 పరుగులు చేయగా డకెట్ 4, 3 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి వారిద్దరి పై మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని ఉంచింది. మరో స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి టీ20 డకౌట్ అయిన అతడు రెండో టీ20లో 13 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి ఇంగ్లీష్ జట్టు అతడికి మరో అవకాశాన్ని ఇచ్చింది.
మూడో టీ20కి ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.