… నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్.. 39 బాల్స్ లో సెంచరీ కొట్టావా.. నిన్ను ఐపీఎల్ లో రిజెక్ట్ చేశారా..!
ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్ పేరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మారు మోగిపోతుంది.

Who is Mitchell Owen 23 year old Australian batter smashes fastest BBL hundred
ఆస్ట్రేలియా యువ ఆటగాడు మిచెల్ ఓవెన్ చరిత్ర సృష్టించాడు. హోబర్ట్ హరికేన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడు బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. ఈ క్రమంలో టీ20 టోర్నీల ఫైనల్స్ మ్యాచుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ రికార్డు కువైట్ ప్లేయర్ రవిజ సందరువన్ పేరిట ఉండేది. మలేషియా ట్రై నేషన్ టీ20 టోర్నీ ఫైనల్ లో హాంకాంగ్ పై 47 బంతుల్లో రవిజ శతకం సాధించాడు.
తాజా సెంచరీతో మిచెల్ ఓవెన్ బిగ్‌బిష్ లీగ్‌లో వేగవంతమైన సెంచరీ రికార్డును సమం చేశాడు. ఓవెన్‌కు ముందు బీబీఎల్‌లో పాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రెయిన్ సైమన్స్ పేరిట ఉండేది. పెర్త్ స్కార్చర్స్ తరుపున సైమన్స్ మూడో బీబీఎల్ సీజన్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ పై 39 బంతుల్లోనే శతకం సాధించాడు.
14 ఏళ్ల నిరీక్షణకు తెర..
బిగ్‌బాష్ లీగ్ 14వ సీజన్‌లో భాగంగా సోమవారం ఓవల్ వేదికగా సిడ్నీ థండర్, హోబర్ట్ హరికేన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. సిడ్నీ బ్యాటర్లలో ఓపెనర్ జాసన్ సంఘా (42 బంతుల్లో 67 పరుగులు) హాఫ్ సెంచరీ చేశగా మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 48 పరుగులు) తృటిలో అర్థశతకాన్ని సాధించాడు. ఒలివర్ డేవిస్ (26) రాణించాడు. హోబర్ట్ హరికేన్స్ బౌలర్లలో రిలే మెరెడిత్, నాథన్ ఎల్లిస్ లు చెరో మూడు వికెట్లు సాధించారు.
అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది హోబర్ట్ హరికేన్స్. ఆ జట్టు ఓపెనర్ మిచెల్ ఓవెన్ తొలి బంతి నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడా పెడా బౌండరీలు బాదాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి బిగ్‌బాష్ లీగ్‌లో ఫాస్టెస్టె సెంచరీ రికార్డును సమం చేశాడు. మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 108 పరుగులు సాధించాడు. అతడు ఔట్ అయినా ఆఖర్లో మాథ్యూ వేడ్(17 బంతుల్లో 32 నాటౌట్) దంచికొట్టడంతో 14.1 ఓవర్లలో మూడు వికెట్లు హోబర్ట్ హరికేన్స్ విజేతగా నిలిచింది. తద్వారా 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి బీబీఎల్ టైటిల్‌ను అందుకుంది హోబర్ట్ హరికేన్స్.
మిచెల్ ఓవెన్ ఎవరు?
హోబర్ట్ హరికేన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ మిచెల్ ఓవెన్ పేరు ప్రస్తుతం మారు మోగిపోతుంది. మిచెల్ ఓవెన్ టాస్మానియాకు చెందిన వాడు. 2021లో బిగ్‌బాష్ లీగ్‌లో అరంగ్రేటం చేశాడు. అయితే.. నిలకడను కొనసాగించలేకపోయాడు. బీబీఎల్ 14వ సీజన్‌లో ప్రతి మ్యాచులోనూ స్థిరంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 11 మ్యాచుల్లో రెండు సెంచరీలతో కలిపి 452 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లోనూ తనదైన ముద్రను వేస్తున్నారు. ఇతడు ఇలాంటి ఆటతీరును కొనసాగిస్తే ఈ కుర్రాడి కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఎగబడడం ఖాయం.