Mohammed Siraj : ఏంటీ బ్రో.. అంత మాట అనేశావు.. స‌మ్‌థింగ్.. స‌మ్‌థింగ్.. వార్త‌ల మ‌ధ్య సింగ‌ర్ ఫోటో షేర్ చేసి మ‌రీ సిరాజ్‌..

సింగ‌ర్‌తో డేటింగ్ అంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై సిరాజ్ స్పందించాడు. ఆమె ఫోటో షేర్ చేసి మ‌రీ సిరాజ్ చెప్పిన ఒక్క మాట‌తో అంద‌రూ సైలెంట్ అయ్యారు.

Mohammed Siraj : ఏంటీ బ్రో.. అంత మాట అనేశావు.. స‌మ్‌థింగ్.. స‌మ్‌థింగ్.. వార్త‌ల మ‌ధ్య సింగ‌ర్ ఫోటో షేర్ చేసి మ‌రీ సిరాజ్‌..

After Rumours Mohammed Siraj Shares Photo With Zanai Bhosle and says my sister

Updated On : January 27, 2025 / 10:02 AM IST

టీమ్ఇండియా స్టార్ పేస‌ర్‌, హైద‌రాబాదీ కుర్రాడు మ‌హ్మ‌ద్ సిరాజ్ ప్రేమ‌లో ఉన్నాడ‌నే వార్త‌లు గ‌త రెండు రోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బాలీవుడ్ లెజెండ‌రీ సింగ‌ర్ ఆశా భోస్లే మ‌న‌వ‌రాలు అయిన సింగ‌ర్ జ‌నై భోస్లేతో సిరాజ్ డేటింగ్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై సిరాజ్ స్పందించాడు. అబ్బే అలాంటిది ఏమీ లేద‌ని అన్నాడు. అంతేనా ఆమె త‌న చెల్లెలు లాంటిద‌ని క్లారిటీ ఇచ్చేశాడు.

ఇటీవ‌ల జ‌నై 23వ పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ బ‌ర్త్‌డే పార్టీకి టీమ్ఇండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ హాజ‌రు అయ్యాడు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోల‌ను జ‌నై సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో ఓ ఫోటోలో వీరిద్ద‌రు క‌లిసి క‌నిపించారు. ఆ ఫోటోలో వారిద్ద‌రు కాస్త స‌న్నిహితంగా ఉన్న‌ట్లు క‌నిపించింది. ఇక అంతే వారిద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్.. స‌మ్‌థింగ్.. అంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి.

Virat Kohli : ఫామ్ కోసం విరాట్ కోహ్లీ తంటాలు.. నువ్వే దిక్కంటూ మాజీ బ్యాటింగ్ కోచ్ వ‌ద్ద‌కు..

 

View this post on Instagram

 

A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle)

ఈ రూమ‌ర్లు చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతుండ‌డంతో సిరాజ్‌, జనైలు అల‌ర్ట్ అయ్యారు. ‘అవ‌న్నీ ఫేక్ న్యూస్‌. ద‌య‌చేసి ఇలాంటి రూమ‌ర్ల‌ను న‌మ్మొద్దు. జ‌నై నాకు చెల్లెలు లాంటిది.’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో సిరాజ్ స్ప‌ష్టంగా చెప్పాడు. ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. జ‌నై లాంటి చెల్లెలు నాకు ఎవ‌రూ లేరు. ఆమె లేకుండా నేను ఉండ‌లేను. ఆకాశంలో ఎన్నో న‌క్ష‌త్రాల మ‌ధ్య చంద్రుడు ఒక్క‌డే ఉన్న‌ట్లుగా ఆమె వెయ్యి మందిలో ఒక‌రు అంటూ ఓ క‌విత్వాన్ని సైతం సిరాజ్ రాసుకొచ్చాడు.

అటు జ‌నై సైతం రూమ‌ర్ల పై స్పందించింది. సిరాజ్ త‌న‌కు ప్రియ‌మైన సోద‌రుడు అని చెప్పింది. వీరిద్ద‌రు స్పందించ‌డంతో డేటింగ్ వార్త‌ల‌కు ఇక చెక్ ప‌డిన‌ట్లే.

IND vs ENG : మ్యాచ్ ఓడిపోయినా.. ఇంగ్లాండ్ కెప్టెన్ వ‌ర‌ల్డ్ రికార్డు.. భార‌త్ అంటే ఇంత ఇష్ట‌మా బ‌ట్ల‌ర్ మామ నీకు..

ఇదిలా ఉంటే.. ఫిబ్ర‌వ‌రిలో పాకిస్థాన్ వేదిక‌గా ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో సిరాజ్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. బుమ్రా, ష‌మీ, అర్ష్‌దీప్ సింగ్‌లు పేస‌ర్ల విభాగంలో చోటు ద‌క్కించుకున్నారు. ఇంగ్లాండ్‌తో టీ20, వ‌న్డే సిరీస్‌లోనూ సిరాజ్‌కు చోటు ద‌క్క‌ని విష‌యం తెలిసిందే.