ENG VS AUS Ashes : ఆస్ట్రేలియా 386 ఆలౌట్.. ఇంగ్లాండ్‌కు స్వ‌ల్ప ఆధిక్యం

అంద‌రిలా తాము కాదంటూ ఇంగ్లాండ్ జ‌ట్టు టెస్టుల్లో బ‌జ్‌బాల్ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. మొద‌టి టెస్టు తొలి రోజే 393-8 స్కోరు వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది

ENG VS AUS Ashes 1st Test

ENG VS AUS : అంద‌రిలా తాము కాదంటూ ఇంగ్లాండ్ జ‌ట్టు టెస్టుల్లో బ‌జ్‌బాల్ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. టెస్టుల్లో సైతం వ‌న్డే, టీ20 త‌ర‌హాలో బ్యాట‌ర్లు చెల‌రేగుతూ భారీ స్కోరు అందిస్తున్నారు. అయితే.. ఇది అన్ని వేళ‌లా స‌రైంది కాద‌ని ఓ ప‌క్క మాజీ ఆట‌గాళ్లు హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ బెన్‌స్టోక్స్ సేన ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌లో సైతం ఇదే వ్యూహాన్ని అనుస‌రిస్తోంది.

ఈ క్ర‌మంలో మొద‌టి టెస్టు తొలి రోజే 393/8 స్కోరు వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది ఇంగ్లాండ్‌. అయితే.. ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రేలియా ధీటుగా బ‌దులు ఇచ్చింది. ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా(141; 321 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) భారీ సెంచ‌రీ చేయ‌గా, అలెక్స్ కేరీ (66; 99 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), ట్రావిస్ హెడ్‌(50; 63 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌డంతో ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 386 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

Virat Kohli : విరాట్ కోహ్లి సంపాద‌న ఎంతో తెలుసా..? మ‌రే క్రికెటర్‌కు కూడా సాధ్యం కాని రీతిలో

ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో ఓలీ రాబిన్స‌న్, స్టువార్ట్ బ్రాడ్ లు చెరో మూడు వికెట్లు తీయ‌గా, మొయిన్ అలీ రెండు, స్టోక్స్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక ఇంగ్లాండ్‌కు 7 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది ఇంగ్లాండ్‌.

75 ప‌రుగులు 5 వికెట్లు

అంత‌క‌ముందు ఓవ‌ర్‌నైట్ స్కోరు 311/5 స్కోర్‌ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించింది ఆస్ట్రేలియా. మ‌రో 75 ప‌రుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. ఆట ఆరంభ‌మైన కాసేప‌టికే ఆసీస్‌కు భారీ షాక్ త‌గిలింది. అర్ధ‌శ‌త‌కంతో ఫామ్‌లో ఉన్న అలెక్స్ క్యారీని అండ‌ర్స‌న్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా.. క‌మిన్స్‌(38)తో క‌లిసి ఖ‌వాజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడు. ఖ‌వాజాను రాబిన్స‌న్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 34 ప‌రుగుల ఏడో వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఖవాజా ఔటైన త‌రువాత ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు ప‌ట్ట‌లేదు.

Usman Khawaja: క్యూట్ వీడియో.. కూతురితో కలిసి విలేకరుల సమావేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్.. ఆ చిన్నారి ఏం చేసిందంటే..

ట్రెండింగ్ వార్తలు