Stuart Broad : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన యువ‌రాజ్ సింగ్ బాధితుడు.. ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌

ఇంగ్లాండ్ సీనియ‌ర్ పేస‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ (Stuart Broad) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Stuart Broad

Stuart Broad announces retirement : ఇంగ్లాండ్ సీనియ‌ర్ పేస‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ (Stuart Broad) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న యాషెస్ సిరీస్‌లోని ఆఖరి టెస్టు మ్యాచే త‌న‌కు చివ‌రి మ్యాచ్ అని చెప్పేశాడు 37 ఏళ్ల బ్రాడ్.

2007లో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు బ్రాడ్‌. దాదాపు 17 ఏళ్ల పాటు ఇంగ్లాండ్ జ‌ట్టుకు సేవ‌లు అందించాడు. యాషెస్ సిరీస్‌లోని ఐదో టెస్టు ముందు 166 టెస్టుల్లో 27.68 స‌గ‌టుతో 600 వికెట్లు తీశాడు. ప్ర‌పంచ క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఐదో బౌల‌ర్‌గా నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్ జ‌ట్టు త‌రుపున టెస్టుల్లో ఆరు వంద‌ల వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా నిలిచాడు. అత‌డి కంటే ముందు జేమ్స్ అండ‌ర్స‌న్ (James Anderson)మాత్ర‌మే ఉన్నాడు.

ఇక ఇంగ్లాండ్ జ‌ట్టు త‌రుపున 121 వ‌న్డేలు ఆడి 178 వికెట్లు 56 టీ20 మ్యాచుల్లో 65 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2016 లో బ్రాడ్ త‌న చివ‌రి వ‌న్డేను ఆడాడు. అప్ప‌టి నుంచి అత‌డు టెస్టుల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాడు. ఇక టెస్టుల్లో త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్‌తో పోటీప‌డి వికెట్లు తీసే బ్రాడ్ ఇలా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డం ఇంగ్లాండ్ అభిమానుల‌ను పెద్ద షాక్‌కు గురి చేసింది.

James Anderson: ఇందుకే జేమ్స్ ఆండర్సన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎక్కువ.. 5 కారణాలు

ఆట‌కు గుడ్ బై చెప్ప‌డం పై బ్రాడ్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని రాత్రే ఇంగ్లాండ్ కెప్టెన్‌ స్టోక్స్‌కు చెప్పిన‌ట్లు వెల్ల‌డించాడు. ఇక డ్రెస్సింగ్ రూంలో ఈ రోజు ఉదయమే అందరికీ చెప్పాన‌న్నాడు. ఆట‌కు గుడ్ బై చెప్పేందుకు ఇదే కరెక్ట్ టైం అనిపించింది. యాషెస్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ సిరీస్‌తో ఆట‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నా. నా చివరి ఆసీస్ ఇన్నింగ్స్‌లో రాణించాలని అనుకుంటున్నా అని బ్రాడ్ అన్నాడు.

ఇక బ్రాడ్ త‌న కెరీర్‌లో నాలుగు యాషెస్ సిరీస్ విజ‌యాల్లో భాగం అయ్యాడు. 2010లో ఇంగ్లాండ్ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకున్న జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. ఇక ఓవ‌రాల్‌గా త‌న టెస్టు కెరీర్‌లో 167 మ్యాచులు ఆడి 602 వికెట్లు తీయ‌డంతో పాటు 3,656 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం యాషెస్ ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 384 ప‌రుగుల ల‌క్ష్యంలో బ‌రిలోకి దిగింది. మ‌రీ బ్రాడ్ త‌న చివ‌రి ఇన్నింగ్స్‌లో ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తాడో అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

MS Dhoni : దొంగచాటుగా ధోని వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్.. ఫ్యాన్స్ ఫైర్‌.. ఇలా చేయ‌డం ఏం బాలేదు

యువ‌రాజ్ సింగ్ బాధితుడే..

స్టువ‌ర్ట్ బ్రాడ్ అని పేరు చెప్ప‌గానే భార‌తీయ అభిమానుల‌కు వెంట‌నే యువ‌రాజ్ సింగ్ బాధితుడిగానే గుర్తుప‌డ‌తారు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాద‌డం అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు. ఆ ఓవ‌ర్‌కు ముందు ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ అండ్రూ ఫ్లింటాప్.. యువరాజ్‌ను రెచ్చ‌గొట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన యువీ ఆ త‌రువాత ఓవ‌ర్ వేసిన బ్రాడ్‌కు చుక్క‌లు చూపించాడు.

Afghanistan Batsman: ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు