IND vs ENG: ఇదెక్కడి షాట్ రా అయ్యా..! రిషబ్ పంత్ కొట్టిన షాట్‌కు బెన్ స్టోక్స్‌కు దిమ్మతిరిగిపోయింది.. నవ్వుకుంటూ పంత్ దగ్గరకొచ్చి.. వీడియో వైరల్..

క్రీజులోకి వచ్చిన తరువాత రెండో బంతికే అద్భుత షాట్ కొట్టడంతో బెన్ స్టోక్ నవ్వుకుంటూ పంత్ వద్దకు వెళ్లాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Rishabh Pant

IND vs ENG: ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. తొలిరోజు భారత్ జట్టు ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు.. సెంచరీలతో అదరగొట్టారు. యశస్వి జైస్వాల్ (101) సెంచరీ చేయగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 127 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాహుల్ (42) కూడా రాణించాడు. ఇదే క్రమంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకొని 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో తొలిరోజు ఆట పూర్తయ్యే సరికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 359 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉంది.

Also Read: Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. అద్భుత బ్యాటింగ్‌తో ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు..

లీడ్స్ టెస్టులో భారత ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ మొదటి వికెట్ కు 91 పరుగులు జోడించారు. కానీ, ఆ తరువాత భారత్ ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (42) అవుట్ కాగా.. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. మొదటి బంతికి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు గౌరవం ఇచ్చాడు. కానీ, రెండో బంతికి ముందుకొచ్చి స్ట్రైట్ గా భారీ షాట్ కొట్టాడు. ఆ బంతి బెన్ స్టోక్ తల పైనుంచి వేగంగా బౌండరీ లైన్‌కు దూసుకెళ్లింది. పంత్ కొట్టిన షాట్‌కు బెన్ స్టోక్ ఆశ్చర్య పోయాడు. కొద్దిసేపు ఆశ్చర్యంగా చూస్తు.. ఆ వెంటనే పంత్ వద్దకు నవ్వుకుంటూ వచ్చాడు.

క్రీజులోకి వచ్చిన తరువాత రెండో బంతికే అద్భుత షాట్ కొట్టడంతో బెన్ స్టోక్ నవ్వుకుంటూ పంత్ వద్దకు వెళ్లి అభినందించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


తొలిరోజు మ్యాచ్ ముగిసే సమయానికి రిషబ్ పంత్ (65 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య 138 పరుగుల భాగస్వామ్యం ఉంది. రెండోరోజు పంత్, గిల్ ఇదే దూకుడును కొనసాగిస్తే భారత్ జట్టు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.