Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. అద్భుత బ్యాటింగ్‌తో ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు..
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

Rishabh Pant
Rishabh Pant Creates History : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు అదరగొట్టారు. సెంచరీలతో ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొట్టుడుకొట్టారు. యశస్వి జైస్వాల్ (101) సెంచరీ చేయగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 127 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాహుల్ (42) కూడా రాణించాడు. ఇదే క్రమంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకొని 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొత్తానికి తొలిరోజు భారత్ కుర్రాళ్లు బ్యాటింగ్‌లో అదరగొట్టారు. ఇంగ్లాండ్ జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించారు. ఇదే క్రమంలో రిషబ్ పంత్ సరికొత్త రికార్డును నమోదు చేశారు.
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంత్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. శుభ్‌మన్ గిల్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో తొలిరోజు మ్యాచ్ ముగిసే సమయానికి 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇదే క్రమంలో ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో 3వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.
వేగంగా 3వేల పరుగులు చేసిన బ్యాటర్..
టెస్ట్ క్రికెట్‌లో ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 3వేల పరుగులకు చేరుకున్న వారిలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. ఆ తరువాత స్థానంలో రిషబ్ పంత్ నిలిచాడు. ఇదే సమయంలో ఎంఎస్ ధోనీ తరువాత టెస్టు క్రికెట్‌లో 3వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా కూడా రిషబ్ పంత్ నిలిచాడు. 27ఏళ్ల పంత్ శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరను అధిగమించి, 3వేల పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన ఆసియా వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోనీ 144 ఇన్నింగ్స్‌లో 4876 పరుగులు చేశాడు.
♦ ఆడమ్ గిల్‌క్రిస్ట్: 63 ఇన్నింగ్స్‌లు
♦ రిషబ్ పంత్: 76 ఇన్నింగ్స్‌లు
♦ కుమార్ సంగక్కర: 78 ఇన్నింగ్స్‌లు
♦ ఆండీ ఫ్లవర్: 78 ఇన్నింగ్స్‌లు
Pant has the THIRD highest Test Average for WK batters with 3000 runs or above behind Andy Flower & Adam Gilchrist 🤯 pic.twitter.com/2SMK5amRJV
— Johns. (@CricCrazyJohns) June 20, 2025
టాప్-5 భారత వికెట్ కీపర్లు వీరే..
SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో టెస్ట్ ఫార్మాట్ లో భారత వికెట్ కీపర్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును ఎంఎస్ ధోనీ కలిగి ఉన్నాడు. ధోనీ ఆ దేశాల్లో 1,731 పరుగులు చేశాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ 1746 పరుగులు చేసి ధోనీ రికార్డును అధిగమించాడు. వీరి తరువాత స్థానంలో ఫరూక్ ఇంజనీర్ (1099) మూడవ స్థానంలో ఉన్నాడు. సయ్యద్ కిర్మాణి (785) నాల్గవ స్థానంలో మరియు కిరణ్ మోర్ (627) ఐదవ స్థానంలో ఉన్నారు.
HISTORY CREATED BY RISHABH PANT.
– Pant has most Test runs as an Asian Wicketkeeper in SENA countries. 🤯 pic.twitter.com/erfvuscXsp
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 20, 2025