India vs England : ఇంగ్లాండ్‌తో భారత్ ఫస్ట్ టెస్ట్.. జైస్వాల్, శుభ్‌మన్ సెంచరీలు.. తొలి రోజు 359/3 స్కోరుతో ఆధిపత్యం!
India vs England : ఇంగ్లాండ్‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్ సెంచరీలతో భారత్ 359/3 పరుగులు చేసింది.

India vs England (Photo Credit : BCCI/X Twitter)
India vs England : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం (India vs England ) దిశగా దూసుకెళ్లింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది.
కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (127; 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (65; 102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో క్రీజులో ఉన్నారు.
యశస్వి జైస్వాల్, గిల్ సెంచరీలు సాధించగా, పంత్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. మొదటి రోజున ఇంగ్లాండ్ తరపున బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీసుకోగా, బ్రైడాన్ కార్స్ ఒక వికెట్ తీశాడు.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రాహుల్, యశస్వి భారత్‌కు మంచి ఆరంభం అందించారు. తొలి మ్యాచ్‌లో వీరిద్దరూ రాణించారు. మొదటి వికెట్‌కు 91 పరుగులు జోడించారు.
కానీ, బ్రైడాన్ కార్స్ కెఎల్ రాహల్‌ను అవుట్ చేయడంతో ఇరువురి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మొదటి మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్ కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. 92 పరుగుల స్కోరు వద్ద యశస్వి గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీలు :
144 బంతులతో జైశ్వాల్ అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. దాంతో తన టెస్ట్ కెరీర్‌లో 5వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌లో తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన 5వ భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
సెంచరీకి ముందు 96 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. యశస్వి ఔట్ తర్వాత గిల్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. గిల్ సెంచరీ చేసి భారత స్కోరును 300 దాటించాడు.
కెప్టెన్‌గా తొలి టెస్ట్‌లోనే శుభ్‌మాన్ అద్భుతంగా రాణించాడు. టెస్ట్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 4వ భారతీయుడిగా గిల్ నిలిచాడు. అతని ముందు విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించారు.
1951లో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయ్ హజారే ఇంగ్లాండ్‌పై అజేయంగా 164 పరుగులు చేశాడు. 1976లో సునీల్ గవాస్కర్ న్యూజిలాండ్‌పై 116 పరుగులు చేశాడు. 2014లో అడిలైడ్‌లో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 115 పరుగులు చేశాడు.
ఇప్పుడు గిల్ కూడా ఈ ప్రత్యేక జాబితాలో చేరాడు. రిషబ్ పంత్ 91 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసి టెస్ట్ కెరీర్‌లో 16వ హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.