రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఐపీఎల్ ట్రోఫీ అనేది అందని ద్రాక్షగానే ఉంది. ఎందరో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికి కూడా 17 సీజన్లలో ఒక్కసారి కూడా ఆ జట్టు ఐపీఎల్ విజేతగా నిలవలేకపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్ 18వ సీజన్‌లో ఎలాగైన ఆ జట్టు కప్పును ముద్దాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో మెగావేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకుంది ఆర్‌సీబీ. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఈ సీజన్‌లో బరిలోకి దిగుతోంది.
All England badminton : ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ముగిసిన భారత పోరాటం..
VIRAT KOHLI HAS ARRIVED IN BENGALURU. pic.twitter.com/SNT1PUeSBC
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2025
ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ నేడు (శనివారం) ఆర్‌సీబీ శిబిరంలో చేరాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. ఆ టోర్నీ అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక ఇప్పుడు అతడు ఐపీఎల్ పై దృష్టి సారించనున్నాడు.
IPL 2025 : ఐపీఎల్ 2025కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త..
కోహ్లీ బెంగళూరుకు చేరుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
Even in the darkness, his aura outglows! ♾️
𝗞𝗮𝘂𝗻? pic.twitter.com/Xj8keDiTi0
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 15, 2025
Ishan Kishan : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తలనొప్పిగా మారిన ఇషాన్ కిషన్? బలం అవుతాడునుకుంటే ?
అందులో ఓ ఆటగాడి నీడ మాత్రమే కనిపిస్తోంది. చీకట్లో కూడా అతని ప్రకాశం ప్రకాశిస్తుంది. అతడు ఎవరో చెప్పుకోవాలని రాసుకొచ్చింది. అది కోహ్లీనే అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.