IPL 2025 : ఐపీఎల్ 2025కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త అందింది.

pic credt@ IPL
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త అందింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి జట్టుతో చేరనున్నాడు. గాయం నుంచి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని ఐపీఎల్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ స్నిగల్ ఇచ్చినట్లు సమాచారం.
ఆస్ట్రేలియా గడ్డ పై అదిరిపోయే ప్రదర్శన చేసిన నితీష్.. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గాయపడ్డాడు. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పక్కటెముకల గాయానికి గురి అయ్యాడు. దీంతో అతడు భారత జట్టుకు దూరం అయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
Ishan Kishan : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తలనొప్పిగా మారిన ఇషాన్ కిషన్? బలం అవుతాడునుకుంటే ?
NITISH KUMAR REDDY’s YO-YO TEST SCORE IS 18.1 🔥
– NKR will join the Sunrisers Hyderabad squad tomorrow for IPL 2025. [Gaurav Gupta from TOI] pic.twitter.com/KWSZ7vgcuY
— Johns. (@CricCrazyJohns) March 15, 2025
యోయో టెస్టులో అతడు 18.1 స్కోరు సాధించాడు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అతడు ఆదివారం సన్‌రైజర్స్‌తో చేరే అవకాశం ఉన్నట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా.. మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభం కానుంది. ఇక హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ మైదానంలో ఆడనుంది.
6 కోట్లు..
ఐపీఎల్ 2024 సీజన్‌లో నితీష్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 303 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో అతడు ఎమర్జింగ్ ప్లేయర్ రికార్డును గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక అయ్యాడు. భారత జట్టు తరుపున అరంగ్రేటం చేశాడు.
ఇక ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఎస్ఆర్‌హెచ్ అతడిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది.