All England badminton : ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ముగిసిన భార‌త పోరాటం..

ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో భార‌త పోరాటం ముగిసింది.

All England badminton : ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ముగిసిన భార‌త పోరాటం..

Updated On : March 15, 2025 / 12:52 PM IST

ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో భార‌త పోరాటం ముగిసింది. మ‌రోసారి భార‌త ష‌ట్ల‌ర్లు క‌ప్పును ముద్దాడ‌కుండానే టోర్నీ నుంచి నిష్ర్క‌మించారు. మొత్తం 17 మంది ష‌ట‌ర్లు బ‌రిలోకి దిగ‌గా.. ఒక్క‌రు కూడా క్వార్ట‌ర్ ఫైన‌ల్ దాటి ముందుకు వెళ్ల‌లేక‌పోయారు. సంచలన విజయాలతో ఆశలు రేకెత్తించిన లక్ష్య సేన్, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ పోరాటం కూడా క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోనే ముగిసింది.

ప్రిక్వార్ట‌ర్స్‌లో ప్ర‌పంచ నంబ‌ర్ 2 ను ఓడించి ల‌క్ష్య‌సేన్ ఆశ‌లు రేపాడు. అయితే.. శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్స్ ఫైన‌ల్‌లో అత‌డు చెనాకు చెందిన లిషి ఫెంగ్ చేతిలో ఓట‌మిని చ‌విచూశాడు. ప్ర‌పంచ 15వ ర్యాంక‌ర్ అయిన ల‌క్ష్య‌సేన్ 10-21, 16-21 తేడాతో ఆరో ర్యాంక‌ర్ అయిన లిషి ఫెంగ్ చేతిలో ఓడిపోయాడు.

IPL 2025 : ఐపీఎల్ 2025కు ముందు స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్‌కు శుభ‌వార్త‌..

ఈ మ్యాచ్‌లో ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్య‌సేన్ త‌న ప్ర‌వాభాన్ని చూపించ‌లేక‌పోయాడు. తొలి గేమ్‌ను కేవ‌లం 17 నిమిషాల్లోనే ఫెంగ్ గెలుచుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో ల‌క్ష్య‌సేన్ కాస్త పుంజుకున్నా కూడా ఫెంగ్ అత‌డికి ఏమాత్రం అవకాశం ఇవ్వ‌లేదు.

ఇక మహిళల డబుల్స్‌లో 2022, 2023లలో సెమీఫైనల్‌ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ క్వార్ట‌ర్స్‌లోనే త‌మ పోరాటాన్ని ముగించింది. చైనాకు చెందిన రెండో సీడ్ షెంగ్‌షు–టాన్‌ నింగ్ జోడి చేతిలో 14–21, 10–21తో ఓడిపోయింది. ఈ టోర్నీలో స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు తొలి రౌండ్ లోనే ఓడిపోయింది. 16 ర్యాంక‌ర్ అయిన సింధు కొరియాకు చెందిన కిమ్ గ వున్ చేతిలో 21-19, 13-21, 13-21 తేడాతో ఓడిపోయింది.

Ishan Kishan : స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్‌కు త‌ల‌నొప్పిగా మారిన ఇషాన్ కిష‌న్‌? బ‌లం అవుతాడునుకుంటే ?

కాగా.. క్వార్టర్‌ ఫైనల్లో ఓడినప్ప‌టికి లక్ష్య సేన్‌కు 7,975 డాలర్లు అంటే భార‌త క‌రెన్సీలో రూ. 6 లక్షల 93 వేలు, గాయత్రి–ట్రెసాలకు 9,062 డాలర్లు అంటే భార‌త క‌రెన్సీలో రూ. 7 లక్షల 87 వేలు ప్రైజ్‌మనీగా లభించాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు భార‌త ష‌ట్ల‌ర్లు మాత్ర‌మే ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. 1980లో ప్రకాశ్‌ పదుకొనే, 2001లో పుల్లెల గోపీచంద్ మాత్ర‌మే టైటిల్స్ సాధించారు. 2015లో సైనా నెహ్వాల్‌, 2022లో ల‌క్ష్య‌సేన్ ఫైన‌ల్ చేరుకున్నా ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.