Faf Du Plessis: వాళ్లు విఫ‌లం కావ‌డం వ‌ల్లే ప్లే ఆఫ్స్ వెళ్ల‌లేక‌పోయాం : డుప్లెసిస్‌

ఐపీఎల్‌(IPL) 2023 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) క‌థ ముగిసింది. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ ప్ర‌ద‌ర్శ‌న‌పై ఆ జ‌ట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis) మాట్లాడాడు

Faf Du Plessis

IPL2023: ఐపీఎల్‌(IPL) 2023 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) క‌థ ముగిసింది. ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్‌( Gujarat Titans)తో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్‌కు చేర‌కుండానే ఆర్‌సీబీ నిష్క్ర‌మించింది. విరాట్ కోహ్లి(Virat Kohli ) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు 5 వికెట్ల న‌ష్టానికి 197 ప‌ర‌గులు చేసింది. అయితే.. శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) మెరుపు సెంచ‌రీతో గుజ‌రాత్‌కు విజ‌యాన్ని అందించాడు. దీంతో ఆర్‌సీబీ ఆశ‌లు ఆవిరి అయ్యాయి.

మ్యాచ్ అనంత‌రం ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ ప్ర‌ద‌ర్శ‌న‌పై ఆ జ‌ట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis) మాట్లాడాడు. తామెందుకు ప్లే ఆఫ్స్‌కు చేర‌లేక‌పోయామో వివ‌రించాడు. ఈ సీజ‌న్‌లో మిడిల్ ఆర్డ‌ర్ పూర్తిగా విఫ‌లం కావ‌డం త‌మ కొంప ముంచింద‌ని చెప్పాడు. ముఖ్యంగా ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో ఎక్కువ‌గా ప‌రుగులు సాధించ‌లేక‌పోవ‌డంతో అనేక మ్యాచుల్లో ఓడిపోవాల్సి వ‌చ్చింద‌న్నాడు.

IPL Playoffs: 10లో 4 మిగిలాయ్‌.. ప్లే ఆఫ్స్ ఇలా.. ఐపీఎల్ విజేత‌ ఎవ‌రో..?

‘గ‌తేడాది దినేశ్ కార్తిక్ సూప‌ర్ ఫామ్‌లో ఉండి డెత్ ఓవ‌ర్ల‌లో ఎక్కువ‌గా ప‌రుగులు చేశాడు. అయితే ఈ సారి అత‌డు దారుణంగా విఫ‌లం అయ్యాడు. ముఖ్యంగా 5, 6, 7 స్థానాల్లో ఆడే బ్యాటర్ల వైఫల్యం టీమ్ విజయవకాశాలను బాగా దెబ్బ‌తీసింది. బౌలింగ్ విభాగం మిడిల్ ఓవ‌ర్ల‌లో ఎక్కువ‌గా వికెట్లు తీయ‌లేక‌పోయింది. సీజ‌న్ ఆసాంతం విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో ఓడిపోవ‌డం తీవ్ర నిరాశ క‌లిగించింది. శుభ్‌మ‌న్ గిల్ సూపర్ సెంచ‌రీ చేశాడు.’ అని డుప్లెసిస్ అన్నాడు.

ఈ సీజ‌న్‌లో నాలుగు సార్లు డ‌కౌటైన డీకే

ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో దినేశ్ కార్తిక్ దారుణంగా విఫ‌లం అయ్యాడు. 13 మ్యాచుల్లో 11.67 స‌గ‌టుతో 140 ప‌రుగులు చేశాడు. నాలుగు మ్యాచుల్లో డ‌కౌట్లు అయ్యాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా చెత్త రికార్డును డీకే మూట‌గ‌ట్టుకున్నాడు. మొత్తం 17 సార్లు డీకే డ‌కౌట్ అయ్యాడు. ఆ త‌రువాత రోహిత్ శ‌ర్మ (16) ఉన్నాడు.

Virat Kohli: కోహ్లి మోకాలికి గాయం.. కీల‌క అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌సీబీ హెడ్ కోచ్ బంగ‌ర్‌