Virat Kohli: కోహ్లి మోకాలికి గాయం.. కీల‌క అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌సీబీ హెడ్ కోచ్ బంగ‌ర్‌

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కు ముందు విరాట్ కోహ్లి గాయ‌ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం. క్యాచ్ అందుకునే స‌మ‌యంలో విరాట్ మోకాలు బ‌లంగా నేల‌ను తాకింది.ఇది చూసిన అభిమానులు టెన్ష‌న్ ప‌డ్డారు.

Virat Kohli: కోహ్లి మోకాలికి గాయం.. కీల‌క అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌సీబీ హెడ్ కోచ్ బంగ‌ర్‌

Virat Kohli knee injure (PHOTO @IPL Twitter)

Sanjay Bangar on Virat Kohli knee injure: ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) ప్ర‌స్థానం ముగిసింది. ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవ‌డంతో ప్లే ఆఫ్స్‌కు చేర‌కుండానే నిష్క్ర‌మించింది. ఈ సంగ‌తి కాస్త ప‌క్క‌న బెడితే ఈ మ్యాచ్‌లో స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి(Virat Kohli) గాయ‌ప‌డ్డాడు. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(WTC Final) కు ముందు విరాట్ గాయ‌ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం.

గుజ‌రాత్ ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్‌లో ఆర్‌సీబీ బౌల‌ర్ విజ‌య‌కుమార్ బౌలింగ్‌లో విజ‌య శంక‌ర్ పుల్ షాట్ ఆడాడు. సరిగ్గా క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో బంతి గాల్లోకి లేచింది. కోహ్లి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ అందుకునే స‌మ‌యంలో విరాట్ మోకాలు బ‌లంగా నేల‌ను తాకింది. ఆ వెంట‌నే విరాట్ మైదానాన్ని వీడాడు. మ్యాచ్ ముగిసే వ‌ర‌కు మ‌ళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్ట‌లేదు.

Virat Kohli: క్రిస్‌గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన కోహ్లి.. ఐపీఎల్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన మొన‌గాడు

ఇది చూసిన అభిమానులు టెన్ష‌న్ ప‌డ్డారు. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు చాలా త‌క్కువ స‌మ‌యం ఉండ‌డంతో విరాట్ గాయంపై అంద‌రి దృష్టి ప‌డింది. దీనిపై మ్యాచ్ అనంత‌రం ఆర్‌సీబీ హెడ్ కోచ్ స్ప‌ష్ట‌త నిచ్చాడు. కోహ్లి మోకాలికి గాయ‌మైన మాట వాస్త‌వ‌మేన‌ని అన్నాడు. అయితే అది మ‌రీ అంత తీవ్ర‌మైన‌ది కాద‌ని, ఎవ్వ‌రు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని చెప్పుకొచ్చాడు.

నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో కోహ్లి రెండు సెంచ‌రీలు చేశాడు. ఇదొక స్పెష‌ల్ అచీవ్‌మెంట్‌. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా ఫీల్డ‌ర్‌గా కూడా జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డాల‌ని కోహ్లి కోరుకుంటాడు. మ్యాచ్‌ను గెలిపించేందుకు అత‌డు వంద‌శాతం క‌ష్ట‌ప‌డుతుంటాడు. అందుక‌నే గ్రౌండ్‌లో ఎక్కువ‌గా ప‌రిగెడుతుంటాడు. ప్ర‌స్తుతం అత‌డు కొద్దిగా అల‌సిపోయాడు. విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని బంగ‌ర్ అన్నాడు.

RCB vs GT: బెంగ‌ళూరుకు షాకిచ్చిన శుభ్‌మ‌న్‌ గిల్‌.. ఆర్‌సీబీ ఇంటికి.. ప్లే ఆఫ్స్‌కు ముంబై