×
Ad

హెచ్‌సీఏలో మరో కలకలం.. టాలెంటెడ్‌ ప్లేయర్లను తొక్కేస్తున్నారా? రాచకొండ సీపీకి ఫిర్యాదు

గతంలో ఆరుగురు ప్లేయర్స్ ను గుర్తించి వారిపై బీసీసీఐ బ్యాన్ విధించింది. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్‌లో వారు అడే విధంగా హెచ్‌సీఏ అవకాశమిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Hyderabad Cricket Association

HCA: హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌లో మరో వివాదం చెలరేగింది. హెచ్‌సీఏతో పాటు పలువురు ప్లేయర్స్ పై రాచకొండ సీపీకి ఫిర్యాదు అందింది.

అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచుల్లో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం నడిచిందని ఆ ఫిర్యాదులో అనంత రెడ్డి పేర్కొన్నారు. పలువురు ప్లేయర్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని చెప్పారు.

Also Read: కల్వకుంట్ల కవిత భారీ యాత్రకు సిద్ధం.. కేసీఆర్ ఫొటో లేకుండానే.. భారీ ప్లాన్‌ రెడీ

ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు లీగ్‌లో ఎంట్రీ ఇస్తున్నారని తెలిపారు. గతంలో ఆరుగురు ప్లేయర్స్ ను గుర్తించి వారిపై బీసీసీఐ బ్యాన్ విధించింది. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్‌లో అడే విధంగా హెచ్‌సీఏ అవకాశమిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం వాటిల్లేలా హెచ్‌సీఏ తీరు ఉందని చెప్పారు. అవినీతికి పాల్పడి, టాలెంట్ లేని ప్లేయర్లను ఆడిస్తున్న హెచ్‌సీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.