NZ vs PAK : బ్యాట‌ర్ సిక్స్ కొట్ట‌గానే.. బాల్ తీసుకుని వెన‌క్కి తిరిగి చూడ‌కుండా ల‌గెత్తిన ఫ్యాన్

న్యూజిలాండ్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో ఓ ఫ‌న్నీ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Fakhar Zaman hits massive six

Fakhar Zaman hits massive six : టీ20 క్రికెట్ మొద‌లైన త‌రువాత బ్యాట‌ర్లు బాదుడే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని సార్లు బాల్స్ స్టేడియం అవ‌త‌ల ప‌డుతున్నాయి. మైదానంలో ప‌డిన బంతిని అయితే ప్రేక్ష‌కులు తిరిగి ఇచ్చేస్తారు గానీ గ్రౌండ్ బ‌య‌ట ప‌డిన బంతులు కొన్ని సార్లు తిరిగి తెస్తున్న‌ప్ప‌టికీ చాలా సార్లు అవీ క‌నిపించ‌కుండా పోయిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. కాగా.. న్యూజిలాండ్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో ఓ ఫ‌న్నీ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ అభిమాని బాల్‌ను తీసుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

ఆదివారం హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో కివీస్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ జ‌రిగింది. పాక్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆరో ఓవ‌ర్‌ను కివీస్ బౌల‌ర్ బెన్ సియర్స్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఓ బాల్‌ను పాక్‌ ఆట‌గాడు ఫ‌ఖ‌ర్ జ‌మాన్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్-లెగ్ దిశ‌గా సిక్స‌ర్ బాదాడు. అయితే.. ఆ బంతి మైదానం దాటి రోడ్డు పై వ‌చ్చి ప‌డింది. బాల్ కోసం ఇద్ద‌రు అభిమానులు ప‌రుగులు తీశారు.

Rohit Sharma : ధోని రికార్డును స‌మం చేసిన రోహిత్.. ఇంకొక్క మ్యాచ్ చాలు..!

చివ‌ర‌కు ఓ అభిమాని బాల్‌ను తీసుకుని అక్క‌డి నుంచి వెనక్కి చూడ‌కుండా ప‌రుగులు తీశాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత‌ బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 194 ప‌రుగులు చేసింది. ఫిన్ అలెన్ (74) అర్ధ‌శ‌త‌కం చేశాడు. విలియ‌మ్‌స‌న్ (26), మిచెల్ సాంట్నర్ లు ప‌ర్వాలేద‌నిపించారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో హరీస్ రవూఫ్ మూడు, అబ్బాస్ అప్రిది రెండు, అమీర్ జ‌మాల్‌, ఉసామా మీర్ చెరో వికెట్ తీశారు.

Yuvraj Singh : కెప్టెన్సీపై యువీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. హార్దిక్ అవ‌స‌రం ఉందంటూనే..

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ 19.3 ఓవ‌ర్ల‌లో 173 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. బాబార్ ఆజాం (66), ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (50) అర్ధ‌శ‌త‌కాలు చేసిన‌ప్ప‌టికీ పాకిస్తాన్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. 21 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ విజ‌యం సాధించింది. కివీస్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ మిల్నే నాలుగు, టిమ్ సౌథీ, బెన్ సియర్స్, ఇష్ సోధిలు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఈ విజ‌యంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు