ODI World Cup 2023 : వరల్డ్ కప్ మ‌న‌దేనా..? రోహిత్ శ‌ర్మ‌ను ప్ర‌శ్నించిన ఫ్యాన్‌.. స‌మాధానం ఏంటో తెలుసా..?

స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస విజ‌యాల‌తో టీమ్ఇండియా దూసుకుపోతుంది.

Rohit Sharma

ODI World Cup : స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస విజ‌యాల‌తో టీమ్ఇండియా దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచులు ఆడిన భార‌త్ అన్ని మ్యాచుల్లో గెలుపొందింది. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ మెగాటోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌మి ఎగుర‌ని జ‌ట్టుగా నిలిచింది. టోర్నీలో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు భార‌త్ కోల్‌క‌తాకు చేరుకుంది.

కాగా.. ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్ మాదేనా అని ఓ భార‌త అభిమాని ముంబై నుంచి వెలుతున్న రోహిత్ శ‌ర్మ‌ను అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ముంబైలో శ్రీలంక‌తో మ్యాచ్ అనంత‌రం కోల్‌క‌తా వెళ్లేందుకు భార‌త జ‌ట్టు ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. భార‌త జ‌ట్టు విమానం ఎక్కేందుకు వెలుతున్న స‌మ‌యంలో ఓ అభిమాని ” వరల్డ్ కప్ అప్నా హై నా (వరల్డ్ కప్ మాదేనా?)” అని రోహిత్ శ‌ర్మ ను అడిగాడు. అభి టైమ్ హై (ఇంకా సమయం ఉంది)” అని రోహిత్ నవ్వుతూ బ‌దులు ఇచ్చాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Virat Kohli : కోహ్లీ పై పాకిస్థాన్ మాజీ పేస‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. నేపాల్‌, జింబాబ్వే పై ఆడితే..

వాంఖ‌డే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 302 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 357 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్ (92), విరాట్ కోహ్లీ (88), శ్రేయ‌స్ అయ్య‌ర్ (82) లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో మ‌ధుశంక ఐదు వికెట్లు తీశాడు. చ‌మీర ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. ల‌క్ష్య ఛేద‌న‌లో శ్రీలంక 19.4 ఓవ‌ర్ల‌లో 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో శ్రీలంక‌కు ఇదే అత్య‌ల్ప స్కోరు. ర‌జిత (14), మాథ్యూస్ (12), తీక్ష‌ణ (12) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోర్లు చేశారు. ఐదుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్లు అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ ఐదు వికెట్లతో లంక ప‌త‌నాన్ని శాసించాడు. సిరాజ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌డు. బుమ్రా, జ‌డేజా చెరో వికెట్ తీశారు.

స‌చిన్ రికార్డును స‌మం చేసేందుకు..

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. వ‌న్డేల్లో విరాట్ ఖాతాలో 48 శ‌త‌కాలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రికార్డు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. స‌చిన్ 49 శ‌త‌కాలు చేశాడు. కాగా.. త‌న పుట్టిన రోజున కోహ్లీ శ‌త‌కం చేసి స‌చిన్ రికార్డును స‌మం చేయాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Shaheen Afridi : 48 ఏళ్ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో.. ఓ పాకిస్థాన్ బౌల‌ర్ చెత్త రికార్డు ఇదే..

ట్రెండింగ్ వార్తలు