Shreyas Iyer : అయ్య‌ర్ పై వేటు.. నెటిజ‌న్ల మండిపాటు.. రోహిత్ శ‌ర్మ, భ‌ర‌త్‌ల‌ కంటే ఎక్కువ..

ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచుల కోసం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జ‌ట్టును ప్ర‌క‌టించింది.

Fans react to Shreyas Iyers absence from India's squad for last 3 England Tests

Shreyas Iyer absence : ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచుల కోసం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జ‌ట్టును ప్ర‌క‌టించింది. మొద‌టి రెండు టెస్టు మ్యాచులు ఆడిన శ్రేయ‌స్ అయ్య‌ర్ పై వేటు వేసింది. ఈ రైట్ హ్యాండ్ బ్యాట‌ర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 26 సగ‌టుతో 104 ప‌రుగులు చేశాడు. ఈ నాలుగు సంద‌ర్భాల్లోనూ మంచి ఆరంభాలు ల‌భించినా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌డంలో విఫ‌లం అయ్యాడు.

అయితే.. అయ్య‌ర్ పై వేటు వేయ‌డాన్ని ప‌లువురు అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ప్పుబ‌డుతున్నారు. ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, వికెట్ కీప‌ర్ కేఎస్ భ‌ర‌త్ ల కంటే అయ్య‌ర్ చేసిన ప‌రుగులే ఎక్కువ అని చెబుతున్నారు. అలాంట‌ప్పుడు శ్రేయ‌స్ అయ్య‌ర్ పై ఎలా వేటు వేస్తారని ప్ర‌శ్నిస్తున్నారు.

No Ball Six Hit wicket : ఇలా ఎప్పుడూ చూసి ఉండ‌రు.. ఒకే బంతికి నోబాల్‌, సిక్స్‌, హిట్‌వికెట్‌..


ఇదిలా ఉంటే.. టెస్టు క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత అయ్య‌ర్ వ‌రుస‌గా 4, 12, 0, 26, 31, 6, 0, 4*, 35, 13, 27, 29 ప‌రుగులు చేశాడు. గ‌త 12 ఇన్నింగ్స్‌ల్లో అత‌డు ఒక్క‌సారి కూడా అర్ధ‌శ‌త‌కాన్ని కూడా సాధించ‌లేదు. ఇలా వ‌రుస‌గా విఫ‌లం అవుతుండ‌డంతోనే అయ్య‌ర్ పై వేటు వేసిన‌ట్లుగా తెలుస్తోంది.

Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!