మ‌రీ ఇంత స్వార్థ‌ప‌రుడివి ఏంట్రా బాబు.. నువ్వు ఇండియా బాబ‌ర్ ఆజాంవి.. గిల్‌పై నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

టీమ్ఇండియా సిరీస్ గెలిచిన‌ప్ప‌టికీ కూడా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ పై ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగుతోంది.

Fans slam Shubman Gill for Selfish play as Yashasvi Jaiswal falls short of century

Shubman Gill – Yashasvi Jaiswal : జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా అద‌రగొడుతోంది. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 5 మ్యాచుల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. హ‌రారే వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచులో భార‌త్ 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.  అయితే.. టీమ్ఇండియా సిరీస్ గెలిచిన‌ప్ప‌టికీ కూడా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ పై ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగుతోంది.

అస‌లు ఏం జ‌రిగిందంటే..?
నాలుగో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు న‌ష్ట‌పోయి 152 ప‌రుగులు చేసింది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ సికింద‌ర్ ర‌జా (46; 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. భార‌త బౌల‌ర్ల‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా.. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, తుషార్ దేశ్ పాండే, అభిషేక్ శ‌ర్మ‌, శివ‌మ్ దూబె లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం టీమ్ఇండియా ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (58 నాటౌట్; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు దంచి కొట్ట‌డంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 15.2 ఓవ‌ర్ల‌లోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది.

కాగా.. ఈ మ్యాచ్‌లో శ‌త‌కానికి 7 ప‌రుగుల దూరంలో య‌శ‌స్వి జైస్వాల్ ఆగిపోయాడు. దీంతో గిల్ పై నెట్టింట విమ‌ర్శ‌ల జ‌డివాన మొద‌లైంది. టీమ్ఇండియా విజ‌యానికి 25 ప‌రుగులు అవ‌స‌రం. అప్పుడు జైస్వాల్ సెంచ‌రీకి 17 ప‌రుగులు, గిల్ హాఫ్ సెంచ‌రీకి 9 ప‌రుగులు కావాలి. ఆ స‌మ‌యంలో య‌శ‌స్వి సెంచ‌రీ అందుకునేందుకు మంచి అవ‌కాశం ఉంది. అయితే.. య‌శ‌స్వికి స్ట్రైకింగ్ ఇవ్వ‌కుండా తానే ఎక్కువ‌గా స్ట్రైకింగ్‌లో ఉన్నాడు గిల్. అత‌డి హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే.. జైస్వాల్ సెంచ‌రీకి మాత్రం అడ్డుప‌డ్డాడు.

Also Read: భార‌త్-శ్రీలంక షెడ్యూల్‌లో మార్పులు.. స‌వ‌రించిన కొత్త షెడ్యూల్ ఇదే..

ఇక్క‌డ గిల్ కాస్త స‌మ‌న్వ‌యంతో ఆడి ఉంటే జైస్వాల్ సైతం సెంచ‌రీ అందుకునేవాడు. హాఫ్ సెంచ‌రీ చేసిన త‌రువాత గిల్ సిక్స్ బాదాడు. ఇక్క‌డు గిల్ ఆ షాట్ ఆడాల్సిన అవ‌స‌రం లేదు. ఇంకా చాలా బంతులు మిగిలే ఉన్నాయి. ఓవ‌ర్లు అయిపోతున్నాయ‌న్న తొంద‌ర‌లేదు. కానీ జైస్వాల్ సెంచ‌రీ చేయొద్దు అన్న ఉద్దేశ్యంతోనే గిల్ ఆ షాట్ కొట్టాడ‌ని అంటున్నారు.

Also Read: నేను సైనా నెహ్వాల్ భ‌ర్త‌ని.. ధోనితో క‌శ్య‌ప్‌.. త‌లా ఆన్స‌ర్ వైర‌ల్‌..

దీంతో నెట్టింట గిల్ పై ట్రోలింగ్ మొద‌లైంది. టీ20ల్లో శ‌త‌కాలు చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని, య‌శ‌స్వికి ఆ అవ‌కాశం వ‌స్తే గిల్ స్వార్థంతో వ్య‌వ‌హ‌రించాడ‌ని అంటున్నారు. గిల్ స్వార్థపరుడు అని కామెంట్లు చేస్తున్నారు. టీమ్ఇండియా బాబ‌ర్ ఆజాం అంటూ మండిప‌డుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు