India vs Srilanka 2024 : భార‌త్-శ్రీలంక షెడ్యూల్‌లో మార్పులు.. స‌వ‌రించిన కొత్త షెడ్యూల్ ఇదే..

టీమ్ఇండియా ఈ నెలాఖ‌రులో శ్రీలంక‌లో ప‌ర్య‌టించ‌నుంది.

India vs Srilanka 2024 : భార‌త్-శ్రీలంక షెడ్యూల్‌లో మార్పులు.. స‌వ‌రించిన కొత్త షెడ్యూల్ ఇదే..

India tour of SriLanka BCCI announces revised schedule for White Ball Series

India vs Srilanka : టీమ్ఇండియా ఈ నెలాఖ‌రులో శ్రీలంక‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడ‌నుంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేసింది. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్త‌వానికి ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం జూలై 26 నుంచి టీ20సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే.. ఒక్క‌రోజు ఆల‌స్యంగా అంటే జూలై 27 కి మార్చారు. అలాగే వ‌న్డే సిరీస్ ఆగ‌స్టు 1 నుంచి ఆరంభం కావాల్సి ఉండ‌గా ఒక్క రోజు ఆల‌స్యంగా ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభం కానుంది.

భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ కొత్త షెడ్యూల్..
టీ20 సిరీస్..
తొలి టీ20 – జూలై 27న‌
రెండ‌ టీ20 – జూలై 28న‌
మూడో టీ20 – జూలై 30న

Team India : ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 నుంచి భార‌త్ వైదొలిగితే..? లంక‌కు గోల్డెన్ ఛాన్స్‌..

వన్డే సిరీస్..
తొలి వ‌న్డే – ఆగస్టు 2న‌
రెండో వన్డే – ఆగస్టు 4న‌
మూడో వ‌న్డే – ఆగస్టు 7న‌

టీ20 సిరీస్‌లోని మ్యాచులు అన్ని భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌లకు ప్రారంభం కానున్నాయి. వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు అన్ని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జ‌రుగుతాయి. కాగా.. ఈ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ ఇంకా ఎంపిక చేయ‌లేదు. త్వ‌ర‌లోనే జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుంది.

Asia Cup 2024 : క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. జూలై 19 భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ