Team India : ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 నుంచి భార‌త్ వైదొలిగితే..? లంక‌కు గోల్డెన్ ఛాన్స్‌..

అప్పుడెప్పుడో 2013లో ధోని సార‌థ్యంలో టీమ్ఇండియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచింది.

Team India : ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 నుంచి భార‌త్ వైదొలిగితే..? లంక‌కు గోల్డెన్ ఛాన్స్‌..

Can India Withdraw From ICC Champions Trophy whats Happen

Team India – Champions Trophy : అప్పుడెప్పుడో 2013లో ధోని సార‌థ్యంలో టీమ్ఇండియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచింది. దాదాపు 11 ఏళ్లుగా మ‌రోసారి ఈ టోర్నీలో భార‌త్ విజేత‌గా నిల‌వ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం టీ20ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న భార‌త్ అదే ఊపులో 2025లో జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిల‌వాల‌ని స‌గ‌టు భార‌త అభిమాని కోరుకుంటున్నాడు. అయితే.. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే పాక్ ఈ టోర్నీకి సంబంధించిన డ్రాప్ట్ షెడ్యూల్‌ను రూపొందించి ఐసీసీకి అంద‌జేసింది.

దాదాపు 28 ఏళ్ల త‌ర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. భద్రతా కారణాల దృష్టా‍ 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత పాకిస్తాన్ ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వలేదు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీని ఎలాగైనా విజ‌య‌వంతం చేయాల‌ని పాకిస్తాన్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. భార‌త్ ఆడే మ్యాచుల‌ను అన్ని లాహోర్ వేదిక‌గానే నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

WCL 2024 Final : పాకిస్థాన్ పై ఇండియా ఛాంపియన్స్ ఘన విజయం.. బౌండరీల మోత మోగించిన తెలుగు తేజం

మ‌రోవైపు బీసీసీఐ ఈ డ్రాప్ట్ షెడ్యూల్ పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. పాక్‌లో ప‌ర్య‌టించేది లేద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లుగా స‌మాచారం. హైబ్రిడ్ మోడ్‌లో భార‌త్ ఆడే మ్యాచుల‌ను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వ‌హించాల‌ని ఐసీసీని కోరింది. దీనిపై ఐసీసీ అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

ఒకవేళ భార‌త్ చేసిన ఈ ప్రతిపాదనని అంగీక‌రించ కుండా పాక్‌లోనే మ్యాచులు నిర్వ‌హించాల‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టుబట్టినా, హైబ్రిడ్ మోడ‌ల్‌లో కాకుండా పాక్‌లోనే టోర్నీ మొత్తాన్ని నిర్వహించాల‌న్న ఐసీసీ భావించినా.. ఈ టోర్నీలో భార‌త్ పాల్గొన‌డం పై సందిగ్ధ‌త ఏర్ప‌డుతుంది. ఎట్టి ప‌రిస్థితుల్లో పాక్‌లో ప‌ర్య‌టించేది లేద‌ని ప‌లు సంద‌ర్భాల్లో బీసీసీఐ అధికారులు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

Shreyas Iyer : టీమ్ఇండియా కోచ్‌గా గంభీర్‌.. ఆశ‌ల ప‌ల‌క్లిలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌..?

ఒక‌వేళ టీమ్ఇండియా ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 నుంచి వైదొలిగితే మాత్రం శ్రీలంక‌కు అదృష్టం క‌లిసి వ‌చ్చిన‌ట్లే. అప్పుడు భార‌త్ స్థానంలో శ్రీలంక ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడ‌నుంది. వ‌న్డేప్ర‌పంచ‌క‌ప్ 2023లో టాప్ 8 స్థానాల్లో నిలిచిన జ‌ట్లు ఛాంపియ‌న్స్ ట్రోఫీకి అర్హ‌త సాధించాయి. టీమ్ఇండియా త‌ప్పుకుంటే అప్పుడు 9వ స్థానంలో ఉన్న లంక ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆడ‌తుంది.