WCL 2024 Final : పాకిస్థాన్ పై ఇండియా ఛాంపియన్స్ ఘన విజయం.. బౌండరీల మోత మోగించిన తెలుగు తేజం

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 (WCL 2024) ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ జట్టు ఘన విజయం సాధించింది.

WCL 2024 Final : పాకిస్థాన్ పై ఇండియా ఛాంపియన్స్ ఘన విజయం.. బౌండరీల మోత మోగించిన తెలుగు తేజం

india champions

World Championship of Legends 2024 Final :  ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 (WCL 2024) ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ జట్టు ఘన విజయం సాధించింది. తద్వారా డబ్ల్యూసీఎల్ 2024 ట్రోపీ విజేతగా నిలిచింది. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో అంబటి రాయుడు, యూసుప్ పఠాన్ రాణించారు. చివర్లో యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. డబ్ల్యూసీఎల్ 2024 టోర్నీ విజేతగా నిలవడంతో ఐసీసీ టోర్నమెంట్ లలో పాకిస్థాన్ పై టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించినట్లే, ఇండియా ఛాంపియన్స్ పాకిస్థాన్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించి వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ ను గెలుచుకుంది.

Also Read : Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో వైరల్

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ 36 బంతుల్లో 41 పరుగులు చేయగా.. చివర్లో సోహైల్ తన్వీర్ తొమ్మిది బంతుల్లో 19 పరుగులు జోడించాడు. భారత్ బౌలర్లు అనురీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, వినయ్ కుమార్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు. 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఛాంపియన్స్ కు మంచి శుభారంభం లభించింది. రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు తొలి వికెట్ కు 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Also Read : Riyan Parag : హార్దిక్ పాండ్యాతో న‌టి అన‌న్య పాండే డ్యాన్స్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న రియాన్ ప‌రాగ్‌..? మీమ్స్ వైర‌ల్‌

మూడో ఓవర్లో నాల్గో బంతికి రాబిన్ ఉతప్ప (10 పరుగులు) ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (4) ఔట్ కాగా.. గురుకీరత్ సింగ్ మాన్ తో కలిసి అంబటి రాయుడు స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 12 ఓవర్లో తొలి బంతికి రాయుడు (50) ఔట్ అయ్యాడు. ఆ తరువాత 13వ ఓవర్లో గురుకీరత్ సింగ్ కూడా (34) ఔట్ అయ్యాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్ జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేయగా.. యూసుఫ్ పఠాన్ (16 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తరువాత ఇర్ఫాన్ పఠాన్ క్రీజులో్కి వచ్చాడు. యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్ వికెట్ కోల్పోకుండా 19.1 ఓవర్లకు పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి డబ్ల్యూసీఎల్ 2024 ట్రోపీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ జట్టును నిలిపారు.