Fatima Sana To Return To Pakistan From T20 World Cup After Fathers Demise
T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌కు జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా టీ20 ప్రపంచకప్ మధ్యలోనే స్వదేశానికి పయమైనమైంది. ఆమె తండ్రి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఫాతిమా దుబాయ్ నుంచి కరాచీకి పయనం అయినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌కు ఆమె దూరమైంది.
ఫాతిమా గైర్హాజరీలో వైస్ కెప్టెన్ మునీబా అలీ పాక్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ మెగాటోర్నీలో రెండు మ్యాచులు ఆడిన పాకిస్థాన్ ఓ మ్యాచులో గెలవగా మరో మ్యాచులో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Rafael Nadal : అభిమానులకు షాకిచ్చిన రఫెల్ నాదల్.. డేవిస్ కప్ తరువాత ఆటకు వీడ్కోలు
గ్రూపు దశలో పాకిస్థాన్ ఇంకో రెండు మ్యాచులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ఫాతిమా జట్టుకు దూరం కావడం పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆమె మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఫాతిమా సనా బంతితోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.