Rafael Nadal : అభిమానుల‌కు షాకిచ్చిన ర‌ఫెల్ నాద‌ల్‌.. డేవిస్ క‌ప్ త‌రువాత ఆట‌కు వీడ్కోలు

దిగ్గ‌జ ఆట‌గాడు రఫెల్‌ నాదల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

Rafael Nadal : అభిమానుల‌కు షాకిచ్చిన ర‌ఫెల్ నాద‌ల్‌.. డేవిస్ క‌ప్ త‌రువాత ఆట‌కు వీడ్కోలు

Rafael Nadal To Retire From Tennis After Davis Cup

Updated On : October 10, 2024 / 4:09 PM IST

దిగ్గ‌జ ఆట‌గాడు రఫెల్‌ నాదల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పేశాడు. దీంతో కోట్లాది మంది అభిమానులు ఒక్క‌సారిగా షాక్‌కు గురి అయ్యారు.  దేశం త‌రుపున ఆఖ‌రి సారి డేవిస్ క‌ప్‌లో ఆడ‌తాన‌ని మాత్రం స్ప‌ష్టం చేశాడు. న‌వంబ‌ర్‌లో డేవిస్ క‌ప్ ఫైనల్ జ‌ర‌గ‌నుంది.

22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల‌ను గెలుచుకున్నాడు ర‌ఫెల్ నాద‌ల్.. కొంత‌కాలంగా గాయాల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు. దీంతో ఆట‌కు రిటైర్‌మెంట్ తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

‘నేను ప్రొపెష‌న‌ల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. మ‌ల‌గాలో న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే డేవిస్ క‌ప్‌లో స్పెయిన్ త‌రుపున చివ‌రి సారిగా ఆడుతా. వాస్త‌వం చెప్పాలంటే గ‌త కొన్నేళ్లు చాలా క‌ష్టంగా గ‌డిచాయి. ముఖ్యంగా గ‌త రెండు ఏళ్లుగా ఎన్నో బాధ‌లు ప‌డ్డాను.’ అని నాద‌ల్ తెలిపాడు. ఇది క‌ఠిన‌మైన నిర్ణ‌యం. జీవితంలో ప్ర‌తి దానికి ప్రారంభం, ముగింపు ఉంటుంది అని నాద‌ల్ చెప్పుకొచ్చాడు.

PAK vs ENG : హ్యారీ బ్రూక్ పెను విధ్వంసం.. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ..

స్పెయిన్ బుల్‌గా పేరొందిన నాద‌ల్ టెన్నిస్ దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌లో ఒక‌డు. ప‌దునైన స‌ర్వీస్, బ‌ల‌మైన బ్యాక్ హ్యాండ్ షాట్ల‌తో విరుచుకు ప‌డే ర‌ఫా త‌న కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల‌ను అందుకున్నాడు. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి. నాద‌ల్ మొత్తంగా 92 ATP సింగిల్స్ టైటిళ్లను కైవ‌సం చేసుకున్నాడు. ఇందులో 36 మాస్టర్స్ టైటిల్స్ అలాగే ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఉంది. సింగిల్స్‌లో కెరీర్ గోల్డెన్ స్లామ్‌ను పూర్తి చేసుకున్న ముగ్గురు పురుష ఆట‌గాళ్లో నాద‌ల్ ఒక‌డు.

గాయాలు వేధిస్తుండ‌డంతో కొన్నాళ్లు ఆట‌కు దూరంగా ఉన్నాడు. పున‌రాగ‌మ‌నంలో ఆశించిన మేర రాణించ‌లేక‌పోయాడు.

Riyan Parag : రియాన్ ప‌రాగ్ వింత బౌలింగ్‌.. తిక్క కుదిర్చిన అంపైర్‌!