Chess World Cup 2023 Final : చెస్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌.. రెండో గేమ్ కూడా డ్రా నే.. ఇక ట్రై బ్రేక్‌లోనే..

ఫిడే చెస్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో రెండో గ్రేమ్ సైతం డ్రాగా ముగిసింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త యువ సంచ‌ల‌నం, గ్రాండ్ మాస్ట‌ర్‌ ప్రజ్ఞానంద, ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ తో త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

Chess World Cup 2023 Final

Chess World Cup Final : ఫిడే చెస్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో రెండో గ్రేమ్ సైతం డ్రాగా ముగిసింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త యువ సంచ‌ల‌నం, గ్రాండ్ మాస్ట‌ర్‌ ప్రజ్ఞానంద(Praggnanandhaa), ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌(Magnus Carlse)తో త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఇరువురి మ‌ధ్య జ‌రిగిన మొద‌టి గేమ్ డ్రాగా ముగియ‌గా, నేడు(ఆగ‌స్టు 23 బుధ‌వారం) జరిగిన రెండో గేమ్ సైతం డ్రా గానే ముగిసింది. దీంతో గురువారం టై బ్రేక్ ద్వారా విజేత‌ను నిర్ణ‌యించ‌నున్నారు.

Team India : నంబ‌ర్ 4 స్థానానికి స‌రైనోడు ఎవ‌రు..? 2019 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత నుంచి 12 మంది ఆడితే..

మొద‌టి మ్యాచ్‌లో 35 ఎత్తుల త‌రువాత ఇద్ద‌రు డ్రా కు అంగీక‌రించ‌గా నేడు జ‌రిగిన రెండో గేమ్‌లో 30 ఎత్తుల త‌రువాత డ్రా చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కార్ల్‌స‌న్ తెల్ల‌పావుల‌తో, 18 ఏళ్ల ప్రజ్ఞానంద న‌ల్ల‌పావుల‌తో బ‌రిలోకి దిగారు. మ్యాచ్ అనంత‌రం ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. ‘ఇది ఒక విధంగా సుల‌భ‌మైన రోజు అని అన్నాడు. ఇద్ద‌రం డ్రాతో సంతోషంగా ఉన్న‌ట్లు తెలిపాడు. మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. అత‌ను చాలా త్వ‌ర‌గా D4ని తీసుకున్నప్పుడు ఆ స‌మ‌యంలో మ్యాచ్ సుల‌భం అని నాకు అనిపించింది.’ అని ప్రజ్ఞానంద చెప్పారు.

చెస్ దిగ్గ‌జం విశ్వ‌నాథ‌న్ ఆనంద్ త‌రువాత ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ లో అడుగుపెట్టిన రెండో భార‌త ఆట‌గాడిగా ప్ర‌జ్ఞానంద రికార్డుల‌కు ఎక్కాడు. సెమీస్‌లో అత‌డు ప్ర‌పంచ మూడో ర్యాంకు ఆట‌గాడు ఫాబియానో క‌రువానాను ఓడించి ఫైన‌ల్‌కు చేరుకున్నాడు.

Chandrayaan 3 : చంద్రయాన్-3 సక్సెస్.. టీమ్ఇండియా ఆట‌గాళ్ల సంబ‌రాలు చూశారా

ట్రెండింగ్ వార్తలు