Abhimanyu Mishra: చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన 16ఏళ్ల కుర్రాడు.. ఏకంగా వరల్డ్ ఛాంపియన్ పై గెలుపు..

భారత సంతతికి చెందిన అమెరికన్ ఆటగాడు అభిమన్యు.. గుకేశ్‌ను మిడిల్ గేమ్‌లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు.

Abhimanyu Mishra: వయసు జస్ట్ 16ఏళ్లు. కానీ, టాలెంట్ టన్నులు టన్నులు ఉంది. ఏకంగా వరల్డ్ ఛాంపియన్ నే ఓడించాడు. చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు భారత సంతతికి చెందిన అమెరికా చెస్ స్టార్ అభిమన్యు మిశ్రా. భారత గ్రాండ్ మాస్టర్, వరల్డ్ ఛాంపియన్ గుకేశ్‌ను ఓడించాడు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా అభిమన్యు రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ ఐదో రౌండ్‌లో అభిమన్యు అద్భుత విజయాన్ని నమోదు చేశాడు.

భారత సంతతికి చెందిన అమెరికన్ ఆటగాడు అభిమన్యు.. గుకేశ్‌ను మిడిల్ గేమ్‌లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. గుకేశ్ తన చాకచక్యంతో ఈ దాడి నుంచి దాదాపు తప్పించుకున్నాడు. కానీ చివరకు అభిమన్యు భారీ విజయాన్ని సాధించాడు.

ఈ టోర్నమెంట్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు అభిమన్యు. గుకేశ్‌ను ఓడించడం ద్వారా అతను సత్తా చూపించాడు.

USA కి చెందిన అభిమన్యు మిశ్రా 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల వయసులో అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్ రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పుడు 16 సంవత్సరాల మిశ్రా, ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్‌పై క్లాసికల్ చెస్ మ్యాచ్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

అభిమన్యు మిశ్రా 2016లో 7 సంవత్సరాల 6 నెలల 22 రోజుల వయసులో USCF 2000 రేటింగ్ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు కూడా. గతంలో GM అవోండర్ లియాంగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) టైటిల్‌ను నవంబర్ 2019లో సంపాదించాడు. అతి ఈ ఘనత సాధించి అతి పిన్న వయస్కుడిగా (10 సంవత్సరాల 9 నెలల 20 రోజులు) ఘనత సాధించాడు.

2021లో, బుడాపెస్ట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ బాలుడు మిశ్రా, సెర్గీ కర్జాకిన్ రికార్డును బద్దలు కొట్టాడు. 2002లో 12 సంవత్సరాల ఏడు నెలల వయసులో తన GM టైటిల్‌ను పూర్తి చేశాడు. 2019లో భారతీయుడు R ప్రజ్ఞానంద నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ మాస్టర్‌గా కూడా రికార్డును కలిగి ఉన్నాడు.

Also Read: ఆసియాక‌ప్ 2025 పై అశ్విన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ద‌క్షిణాఫ్రికానైనా చేరిస్తే బాగుండేది.. మ్యాచ్‌లు ఏమంత..