FIFA World Cup 2026 : ఏమ‌య్యా మ్యాచ్ రిఫ‌రీ ఎల్లో కార్డు మ‌రిచిపోయావా ఏంది? మూడు రెడ్ కార్డులే.. మీమ్స్ వైర‌ల్‌

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 తొలి మ్యాచ్‌లోనే మ్యాచ్ రిఫ‌రీ (FIFA World Cup 2026) నేరుగా మూడు రెడ్ కార్డులు ఇవ్వ‌డం పై నెట్టింట విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

FIFA World Cup 2026 Memes Galore After 3 Red Cards Shown In Mexico vs South Africa match

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో మెక్సికో, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో మెక్సికో 2-0 తేడాతో విజ‌యాన్ని సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో మూడు రెడ్ కార్డుల‌ను మ్యాచ్ రిఫ‌రీ ఇచ్చాడు. ఈ విష‌యం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ్యాచ్ రిఫ‌రీ కార‌ణంగానే ద‌క్షిణాఫ్రికా ఓడిపోయింద‌ని, అందుక‌నే మ్యాచ్ రిఫ‌రీ విల్ట‌న్ సాంపియోకే ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల‌ని నెటిజ‌న్లు ఎద్దేవా చేస్తున్నారు. ద‌క్షిణాప్రికాకు ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌కు రిఫ‌రీ డైరెక్ట్‌గా రెడ్ కార్డును ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్‌లో చాలా స‌మ‌యం పాటు ద‌క్షిణాఫ్రికా 9 మంది ప్లేయ‌ర్ల‌తోనే ఆడాల్సి వ‌చ్చింది.

*Vaibhav Sooryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీ అంత‌ర్జాతీయ అరంగ్రేటం ఆల‌స్యం కానుందా? సందిగ్ధంలో ఐర్లాండ్ సిరీస్‌..?

వాస్త‌వానికి గ‌త ప్ర‌పంచ‌క‌ప్ (2022) టోర్నీ మొత్తంలో కేవ‌లం నాలుగు రెడ్ కార్డులు మాత్ర‌మే ఇచ్చారు. అయితే.. ఈ సారి ఆరంభ మ్యాచ్‌లోనే ఏకంగా 3 రెడ్ కార్డులు ఇవ్వ‌డం జ‌రిగింది. ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే ఒకే మ్యాచ్‌లో ఇన్ని రెడ్ కార్డులు ఇవ్వ‌డం.. అది కూడా ఎలాంటి హెచ్చ‌రిక‌లు లేకుండా ఇవ్వ‌డం ఇదే మొద‌టిసారి.

రెడ్ కార్డు ఎందుకు ఇస్తారు?

సాధార‌ణంగా ఫుట్‌బాల్‌ ఆట‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించే ఆట‌గాడికి రిఫ‌రీ రెడ్ కార్డు ఇస్తుంటాడు. అయితే.. ముందుగా రెండు సార్లు ఎల్లో కార్డులు ఇస్తారు. అయిన‌ప్ప‌టికి కూడా ఆట‌గాడు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తే అప్పుడు మాత్ర‌మే రెడ్ కార్డు ఇస్తుంటారు.

ఎవ‌రైనా ప్లేయ‌ర్‌కు రెడ్ కార్డు ఇస్తే.. ఆ త‌రువాత నుంచి అత‌డు డ‌గౌట్‌కే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. అత‌డి స్థానంలో మ‌రో ఆట‌గాడికి అవ‌కాశం ఉండ‌దు. అప్పుడు 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. ఇక రెడ్ కార్డును తీసుకున్న ఆట‌గాడిపై త‌రువాత ఓ మ్యాచ్ నిషేదం విధిస్తారు. అయితే.. అది రిఫ‌రీ నిర్ణ‌యం పైనే ఆధార‌ప‌డి ఉంటుంది.

*FIFA World Cup 2026 : ప్ర‌పంచ‌క‌ప్‌లో ఈ మ్యాచ్‌లను అస్స‌లు మిస్ కావొద్దు.. ఫ్యాన్స్‌ను కట్టిపడేసే 5 హై వోల్టేజ్ మ్యాచ్‌లు ఇవే..

కాగా.. ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 తొలి మ్యాచ్‌లో రిఫ‌రీ మాత్రం ముగ్గురు ప్లేయ‌ర్ల‌కి ఒక్క‌సారి కూడా ఎల్లో కార్డు ఇవ్వ‌కుండానే రెడ్ కార్డు చూపించ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఇదే విష‌యం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.  దీనిపై నెట్టింట మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి.