Ishan Kishan Pic: ©ANI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 286/6 స్కోరు బాదింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోరు.
ఈ మ్యాచులో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో మొదటి నుంచీ ఎస్‌ఆర్‌హెచ్ అదరగొట్టింది. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ ధాటిగా ఆడారు. ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ బాదాడు.
Travis Head
Pic: ©ANI
అభిషేక్ శర్మ 24 (11 బంతులు, 5 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (31 బంతులు, 3 సిక్సులు, 9 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి 30 (15 బంతులు, ఒక సిక్స్, 4 ఫోర్లు) పరుగులు చేశారు. ఇక ఇషాన్ కిషన్ 106 నాటౌట్ (47 బంతులు, 6 సిక్సులు, 11 ఫోర్లు), అంకిత్ వర్మ 7 (3 బంతులు, ఒక సిక్స్) రన్స్ చేశారు. అభినవ్ మనోహర్ డకౌట్ కాగా, పాట్ కమ్మిన్స్ (0) నాటౌట్‌గా నిలిచాడు.
Tushar Deshpande takes the catch of Sunrisers Hyderabad’s Travis Head
Pic: ©ANI
ఆర్ఆర్ బౌలర్లలో తుషార్‌కు 3, మనీశ్ తీక్షణకు 2, జోఫ్రా అర్చర్‌కు ఓ వికెట్ దక్కాయి. హోం గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోరు నమోదు చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ