WPL2023
WPL 2023: మహిళల క్రికెట్ చరిత్రలో నవశకం ప్రారంభం కాబోతుంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 87 మంది మహిళ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ప్రపంచ స్థాయి క్రికెటర్లు పాల్గోనున్న ఈ టోర్నీ క్రికెట్ ప్రేమికులకు సందడిగా మారనుంది. తొలి మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈనెల 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా తొలి సీజన్ కప్‌ను దక్కించుకోవాలని ఐదు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌లో ముంబయి (కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్), బెంగళూరు (కెప్టెన్ స్మృతి మంధాన), గుజరాత్ (కెప్టెన్ బెత్ మూనీ), యూపీ (కెప్టెన్ అలీసా హీలీ), ఢిల్లీ (కెప్టెన్ మెగ్ లానింగ్) జట్లు పోటీ పడనున్నాయి. ఈరోజు గుజరాత్ వర్సెస్ ముంబయి జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఆరంభం అదిరేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి రెండుగంటల ముందే బాలీవుడ్ నటీమణులు సందడి చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు కియారా అద్వాణీ, కృతి సనన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం ద్వారా సందడి చేయనున్నారు.
ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లనూ ఉచితంగా వీక్షించే అవకాశాన్ని మహిళలు, బాలికలకు బీసీసీఐ కల్పిస్తోంది. అమ్మాయిలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే స్టేడియాలకు వెళ్లి మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. ఈ డబ్ల్యూపీఎల్‌లో ఒక మ్యాచ్ ఉన్నరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు మ్యాచ్‌లు ఉన్న రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి మ్యాచ్, రాత్రి 7.30 గంటలకు రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది.
https://twitter.com/wplt20/status/1630791797503868929?cxt=HHwWgoC2jfyf3qEtAAAA