WPL Auction 2023: డబ్ల్యూపీఎల్‌లో భారత్ తరువాత ఆసీస్ ప్లేయర్లదే హవా.. ఏ దేశం నుంచి ఎంత మంది ఎంపికయ్యారంటే?

డబ్ల్యూపీఎల్ వేలంలో ఇండియా మహిళా క్రికెటర్ల తరువాత ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా సాగింది. విదేశీ ఆటగాళ్ల విషయంలో ప్రాంచైజీలు ఎక్కువగా ఆసీస్ మహిళా ప్లేయర్లపైనే గురిపెట్టారు. ఆ తరువాత వేలంలో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లను ప్రాంచైజీలు కొనుగోలు చేశాయి.

WPL Auction 2023: డబ్ల్యూపీఎల్‌లో భారత్ తరువాత ఆసీస్ ప్లేయర్లదే హవా.. ఏ దేశం నుంచి ఎంత మంది ఎంపికయ్యారంటే?

australia players

WPL Auction 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో కీలక మహిళా ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. దాదాపు పదహారు మంది మహిళా ప్లేయర్లను ప్రాంచైజీలు కోట్లు పెట్టి దక్కించుకున్నాయి. డబ్ల్యూపీఎల్‌లో అత్యధికంగా టీమిండియా ప్లేయర్లకు ప్రాధాన్యత దక్కింది. ఆ తరువాతి స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా సాగింది. ఆస్ట్రేలియా నుంచి దాదాపు 14 మంది మహిళా ప్లేయర్లను ప్రాంచైజీలు వేలంలో పోటీపడి మరీ దక్కించుకున్నాయి. సోమవారం జరిగిన వేలంలో మొత్తం 87 మంది ప్లేయర్లకు అదృష్టం వరించింది.

WPL Auction 2023 LIVE Updates: విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం అప్డేట్స్.. కోట్లు కొల్లగొట్టిన అమ్మాయిలు

డబ్ల్యూపీఎల్ వేలంలో మొత్తం ఐదు ప్రాంచైజీలు పాల్గొన్నాయి. ప్రాంచైజీలు 75 మంది నుంచి 90 మంది ప్లేయర్లను కొనుగోలు చేయొచ్చు. వీరిలో 30 మంది విదేశీ ప్లేయర్లు కాగా మిగిలినవారు భారతీయ మహిళా ప్లేయర్లు ఉండాలి. ప్రతీ ప్రాంచైజీకి 15 నుంచి 18 మంది ప్లేయర్లను వేలంలో దక్కించుకోవచ్చు. అయితే, వీరిలో ఆరుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఉండాలి. సోమవారం జరిగిన వేలంలో భారతీయ మహిళా క్రికెటర్లు 57 మందిని వేలంలో ఐదు ప్రాంచైజీలు దక్కించుకున్నాయి.

Mallika Sagar: WPL వేలంలో అందరి దృష్టి మల్లికా సాగర్ పైనే.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. దినేష్ కార్తీక్ ఏం ట్వీట్ చేశాడంటే..

ఇండియా మహిళా క్రికెటర్ల తరువాత ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా సాగింది. విదేశీ ఆటగాళ్ల విషయంలో ప్రాంచైజీలు ఎక్కువగా ఆసీస్ మహిళా ప్లేయర్లపైనే గురిపెట్టారు. దీంతో 14 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లను ప్రాంచైజీలు వేలంలో దక్కించుకున్నాయి. వీరిలో కొందరికి కోట్లలో వెచ్చించగా.. మరికొందరికి లక్షల్లో వెచ్చించాయి. 14మంది ప్లేయర్లకు మొత్తం 14.25 కోట్లు ప్రాంచైజీలు ఖర్చుచేశాయి. మూడో స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఉన్నారు. ఏడుగురు ఇంగ్లాండ్ ప్లేయర్లను కొనుగోలు చేసిన ప్రాంచైజీలు వీరికోసం రూ. 7.35 కోట్లు వెచ్చించాయి. దక్షిణాఫ్రికాకు చెందిన నలుగురు ప్లేయర్లకు 3.1 కోట్లు, న్యూజిలాండ్ ప్లేయర్లు ఇద్దరికి 1.5 కోట్లు, వెస్టిండీస్ కు చెందిన ఇద్దరు ప్లేయర్లకు రూ. కోటి, అమెరికాకు చెందిన ఒక ప్లేయర్ల కు రూ. 10లక్షలు ప్రాంచైజీ యాజమాన్యాలు వెచ్చించాయి. ఇదిలాఉంటే.. భారత్ ప్లేయర్లలో 57మందికిగాను ప్రాంచైజీ యాజమాన్యాలు రూ. 32.2 కోట్లు ఖర్చు చేశాయి.