IPL 2021 : మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు.

Kohli

Kohli Is Crying : తన కెప్టెన్సీలో చివరి ఐపీఎల్ 2021 ఆడుతున్న ఆర్సీబీకి ట్రోఫి అందించాలన్న విరాట్ కోహ్లీ కల నెరేరలేదు. ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. ఓడిపోయిన అనంతరం కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. తీవ్రంగా ఏడుస్తూ కనిపించాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. అతడితో పాటు..డివిలియర్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారు ఉద్వేగానికి లోనవుతున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు.

Read More : IPL 2021 KKR Vs RCB : చేతులెత్తేసిన బెంగళూరు బ్యాటర్లు.. కోల్‌కతా టార్గెట్ 139

అయితే..కోహ్లీ ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. కోహ్లీ ఇలా ఏడుస్తూ కనిపించడం చాలా అరుదు అని అంటున్నారు. 2016 ఐపీఎల్ లో కోహ్లీ జట్టు ఫైనల్ పరాజయం పాలైన సమయంలో…భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చనిపోయిన సమయంలో కూడా కన్నీళ్లు రాలేదని ఓ సారి అమెరికన్ స్పోర్ట్స్ రిపోర్టర్ గ్రాహం బెన్సింగర్ తో కోహ్లీ చెప్పుకొచ్చారు.

Read More : Pakistan PM Imran Khan: ఇండియా వరల్డ్ క్రికెట్‌ను శాసిస్తోంది – పాక్ పీఎం

తన తండ్రి చనిపోయే సమయంలో తాను నాలుగు రోజుల మ్యాచ్ ఆడుతున్నట్లు, తెల్లవారుజామున 2.30 గంటలకు చనిపోయాడని..దీంతో కుటుంబసభ్యులందరూ ఏడుస్తూ ఉన్నా..తన కళ్లల్లో మాత్రం నీళ్లు రాలేదని..అసలు ఎందుకలా జరిగిందో అర్థం కాలేదన్నారు. మరుసటి రోజు బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కోహ్లీ…ఈ టెస్టులో 90 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే…ఉత్కంఠ భరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.