Pakistan PM Imran Khan: ఇండియా వరల్డ్ క్రికెట్‌ను శాసిస్తోంది – పాక్ పీఎం

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా వాఖ్యల రోజుల వ్యవధిలో పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఇండియా గురించి మాట్లాడారు. వరల్డ్ క్రికెట్ ను ఇండియా శాసిస్తోందని అన్నారు.

Pakistan PM Imran Khan: ఇండియా వరల్డ్ క్రికెట్‌ను శాసిస్తోంది – పాక్ పీఎం

Pakistan Pm

Updated On : October 11, 2021 / 10:51 PM IST

Pakistan PM Imran Khan: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా వాఖ్యల రోజుల వ్యవధిలో పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఇండియా గురించి మాట్లాడారు. వరల్డ్ క్రికెట్ ను ఇండియా శాసిస్తోందని అన్నారు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు పాకిస్తాన్ పర్యటనకు రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఇలా అన్నారు.

టీ20 వరల్డ్ కప్ ఈవెంట్ కు ముందు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో పాకిస్తాన్ వైట్ బాల్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో సెక్యూరిటీ అంశాల రీత్యా నిర్ణయం వెనక్కు తీసుకుంటున్నామని పర్యటనను రద్దు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ ఫిజికల్, మెంటల్ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకను్న ఇమ్రాన్ ఖాన్ ఇలా అన్నారు.

…………………………………………. : లైఫ్‌లో తప్పులు చేసి నేర్చుకోండి- సమంత

పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్:
‘ఇంగ్లాండ్ స్వతహాగానే చెప్పింది. కానీ నాకు ఇంగ్లాండ్.. పాకిస్తాన్ లాంటి దేశంతో క్రికెట్ ఆడి ఏదైనా సాయం చేయాలనుకుంటుంది అనుకుంటున్నా. అందులో ఒక కారణమేంటంటే డబ్బు. డబ్బు అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయం. క్రికెట్ బోర్డుతో పాటు ప్లేయర్లకు కూడా అది చాలా ముఖ్యం. ఇండియాలో డబ్బు ఉంది. అందుకే ఇండియా ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోంది. వాళ్లు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. వాళ్లని ఎదిరించే ధైర్యం ఎవరూ చేయలేరు. ఎందుకంటే వారికి ఆ లెక్కలు తెలుసు. ఇండియా ఒక్కటే క్రికెట్ బోర్డు మీద అంత సంపాదించగలదు’ అని అన్నారు.

రమీజ్ రాజా:
‘ఐసీసీలో రాజకీయ పరంగా ఆసియా, పాశ్చాత్య దేశాల వర్గాలు విడిపోయాయి. దాని ఆదాయంలో 90శాతం భారత్‌ నుంచే వస్తుంది. ఇది భయపెట్టే విషయం. పీసీబీ ఆదాయంలో 50 శాతం ఐసీసీ ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ క్రికెట్‌ను నడిపిస్తోంది భారత వ్యాపార సంస్థలే’ అని రమీజ్ చెప్పుకొచ్చారు. భారత్‌లో ప్రభుత్వాలు గట్టిగా పట్టుబట్టి, ప్రధాని జోక్యం చేసుకుని పాకిస్తాన్‌కు నిధులు ఆపేయమంటే పీసీబీ కుప్పకూలిపోతుందని అన్నాడు.