×
Ad

Mumbai Indians : టాటా.. బైబై.. ఈ ఐదుగురికి ముంబై గుడ్ బై?

మిగిలిన ఫ్రాంఛైజీల ప‌రిస్థితి ఎలా ఉన్నప్ప‌టికి స్టార్‌ల‌తో నిండిన ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) జ‌ట్టు ఎవ‌రిని పెట్టుకుంటుంది? ఎవ‌రిని వేలానికి విడుద‌ల చేస్తుంది అన్న‌ది అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

Five players Mumbai Indians could release ahead of IPL 2026 auction

Mumbai Indians : ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు అన్ని జ‌ట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ సీజ‌న్ కన్నా ముందు మినీ వేలాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేలానికి విడుద‌ల చేసే, అట్టి పెట్టుకునే ఆట‌గాళ్ల జాబితాను ప్ర‌క‌టించేందుకు అన్ని ఫ్రాంఛైజీల‌కు న‌వంబ‌ర్ 15 డెడ్‌లైన్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో మిగిలిన ఫ్రాంఛైజీల ప‌రిస్థితి ఎలా ఉన్నప్ప‌టికి స్టార్‌ల‌తో నిండిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఎవ‌రిని అట్టి పెట్టుకుంటుంది? ఎవ‌రిని వేలానికి విడుద‌ల చేస్తుంది అన్న‌ది అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. వేలానికి ఓ ఐదుగురు ఆట‌గాళ్ల‌ను ముంబై విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వారు ఎవ‌రంటే..?

రీస్ టోప్లీ..

వేలంలో రీస్ టోప్లీ ని ముంబై రూ.75ల‌క్ష‌లకు కొనుగోలు చేసింది. 2025 సీజ‌న్‌లో అత‌డు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఈ క్ర‌మంలో అత‌డిని వేలానికి విడుద‌ల చేసి కొత్త ఆట‌గాడిని సొంతం చేసుకోవాల‌ని ముంబై భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Abhishek Sharma : కుడి చేతి పై టాటూ వేయించుకున్న అభిషేక్ శ‌ర్మ‌.. పిక్స్ వైర‌ల్‌..

లిజాద్ విలియమ్స్..

దక్షిణాఫ్రికాకు చెందిన లిజాద్ విలియమ్స్‌ను వేలంలో ముంబై రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అత‌డు ఇంత వ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ముంబై త‌రుపున ఆడ‌లేదు. అత‌డు జ‌ట్టు ప్ర‌ణాళిక‌ల‌లో లేడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే అత‌డిని వేలానికి విడుద‌ల చేయొచ్చు.

బెవాన్ జాకబ్స్..

బెవాన్ జాకబ్స్‌ను ముంబై జ‌ట్టు రూ.30ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. ఇత‌డు కూడా ముంబై ప్ర‌ణాళిక‌ల్లో లేడ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ 2026 వేలానికి విడుద‌ల చేయొచ్చు.

దీపక్ చాహర్..

వేలంలో దీప‌క్ చాహ‌ర్‌ను ముంబై జ‌ట్టు 9.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. గ‌త సీజ‌న్‌లో అత‌డు 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. 33 ఏళ్ల దీప‌క్ చాహ‌ర్‌ను ముంబై వేలానికి విడుద‌ల చేయ‌వ‌చ్చు. భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని మ‌రో యువ పేస‌ర్ కోసం ముంబై వేలంలో ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

Sanju Samson-Jadeja : సంజూ శాంస‌న్-ర‌వీంద్ర‌ జ‌డేజా ట్రేడ్ డీల్‌లో సూప‌ర్ ట్విస్ట్‌.. ఆగిపోయిన చ‌ర్చ‌లు..!

కర్ణ్ శర్మ..

ఐపీఎల్ 2026 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ విడుదల చేసే ఐదో ఆట‌గాడు కర్ణ్ శర్మ కావ‌చ్చు. ముంబై అత‌డిని రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. గ‌త సీజ‌న్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. పెద్ద‌గా రాణించ‌లేదు.