Football Legend Pele: ఐసీయూలో పీలే.. పుట్‌బాల్ దిగ్గజానికి సర్జరీ!
లెజండరీ ఫుట్ బాల్ స్టార్ పీలె ఐసీయూలో చికిత్స పొందుతన్నారు. బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే పెద్దప్రేగు ట్యుమర్ సర్జరీ ద్వారా తొలగించారు. పీలే ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Football Legend Pele Recovering Satisfactorily
Football legend Pele : లెజండరీ ఫుట్ బాల్ స్టార్ పీలె ఐసీయూలో చికిత్స పొందుతన్నారు. బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పెద్దప్రేగుకు కుడిభాగంలో ట్యుమర్ గడ్డను సర్జరీ ద్వారా వైద్యులు విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం పీలే స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని, ఉత్సాహంగా మాట్లాడగలుతున్నారుని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన శరీర అవయవాలు కూడా బాగానే పనిచేస్తున్నాయని చెప్పారు. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఐసీయూలో ఉంచినట్టు వైద్యులు పేర్కొన్నారు.
పీలే ఆరోగ్యం మెరుగుపడటంతో తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు తెలియజేశారు. రెగ్యులర్ చెకప్‌లోనే గత నెలలో ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిపారు. పెద్దపేగులో ట్యూమర్ ఉందని గుర్తించి వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించారని తెలిపారు. రొటీన్ కార్డియోవాస్కులర్, లాబోరేటరీ పరీక్షల్లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించినట్టు వైద్యులు వెల్లడించారు.
Mrunal : విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించా – బాలీవుడ్ నటి
బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా పీలే మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా రికార్డు సాధించాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున పీలే 92 మ్యాచులు ఆడి 77 గోల్స్ చేశాడు. అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా పీలే పేరిటే ఉంది. క్లబ్ ఫుట్‌బాల్ పోటీల్లోనూ అత్యధిక గోల్స్ రికార్డు పీలేదే..
View this post on Instagram
ఈ రికార్డును అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ లియోనల్ మెస్సీ 2020 ఏడాదిలో బ్రేక్ చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్ క్లబ్‌కు 19 సీజన్ల పాటు ఆడాడు. ఆ మ్యాచ్ ల్లో 643 గోల్స్ చేశాడు. 2004 నుంచి 2020 వరకు బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ.. 17 సీజన్ల పాటు ఆడి 749 మ్యాచ్‌ల్లో 644 గోల్స్ చేసి పీలే ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
Al Qaeda Leader : చనిపోయాడనుకున్న అల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడు