Sachin Tendulkar : ఫేక్ యాడ్స్ పై పోలీసులకు సచిన్ టెండూల్కర్ ఫిర్యాదు

సచిన్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420, 465, 500 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫేక్ యాడ్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sachin Tendulkar

Sachin Tendulkar police complaint : భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఫేక్ యాడ్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఫేక్ యాడ్స్ పై శనివారం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సచిన్ ఫిర్యాదు చేశారు. కొన్ని యాడ్స్ కు అనుమతి లేకుండానే తన పేరు, ఫొటో వాయిస్ ను వాడుతున్నారంటూ సచిన్ టెండూల్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు యాడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Sachin Tendulkar Double Ton: సచిన్ టెండూల్కర్ జీవితంలో మరో మరపురాని రోజు ఇది

ఈ మేరకు ఆ యాడ్ సంస్థలపై ముంబైలోని వెస్ట్ రీజియన్ సైబర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సచిన్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420, 465, 500 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫేక్ యాడ్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.