former India left arm spinner Dilip Doshi dies at 77
భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూశారు. సోమవారం లండన్‌లో గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1979–1983 మధ్య టీమ్ఇండియాకు దిలీప్ దోషి ప్రాతినిథ్యం వహించారు. 33 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 114 వికెట్లు తీయగా వన్డేల్లో 22 వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగ్రేటం చేసిన దిలీప్ ఆ మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శన చేశారు. 8 వికెట్లు పడగొట్టారు.
ENG vs IND : ఇక బౌలర్లపైనే మొత్తం భారం.. భారత్‌కు 10.. ఇంగ్లాండ్‌కు 350..
The BCCI mourns the sad demise of former India spinner, Dilip Doshi, who has unfortunately passed away in London.
May his soul rest in peace 🙏 pic.twitter.com/odvkxV2s9a
— BCCI (@BCCI) June 23, 2025
దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇక ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో వార్విక్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్ జట్ల తరఫున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత ఆయన లండన్‌లో నివసిస్తున్నారు.
దిలీప్ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. ఇక దిలీప్ మృతికి సంతాపంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆటలో టీమ్ఇండియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్స్‌తో బరిలోకి దిగనున్నారు.