ENG vs IND : ఇక బౌల‌ర్ల‌పైనే మొత్తం భారం.. భార‌త్‌కు 10.. ఇంగ్లాండ్‌కు 350..

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య హెడింగ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.

ENG vs IND : ఇక బౌల‌ర్ల‌పైనే మొత్తం భారం.. భార‌త్‌కు 10.. ఇంగ్లాండ్‌కు 350..

ENG vs IND 1st Test England need 350 runs to win the test match final day

Updated On : June 24, 2025 / 8:23 AM IST

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య హెడింగ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. భార‌త జ‌ట్టు రెండో ఇన్నింగ్స్‌లో 364 ప‌రుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం క‌లుపుకుని ఇంగ్లాండ్‌ ముందు 371 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్‌ను మొద‌లు పెట్టిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 21/0 స్కోరుతో నిలిచింది. మ‌రొక్క రోజు ఆట మాత్ర‌మే మిగిలి ఉండ‌గా ఇంగ్లాండ్ విజ‌యానికి 90 ఓవ‌ర్ల‌లో ఇంకా 350 ప‌రుగులు కావాల్సి ఉంది. అటు భార‌త్ గెల‌వాలంటే 10 వికెట్లు అవ‌స‌రం. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు గెల‌వాలంటే బౌల‌ర్లు రాణించాల్సిందే.

31 ప‌రుగులు ఆరు వికెట్లు..

రెండో ఇన్నింగ్స్‌లో 90/2తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా కేఎల్ రాహుల్ (137), రిష‌బ్ పంత్ (118) భారీ శ‌త‌కాల‌తో చెల‌రేగ‌డంతో ఓ ద‌శ‌లో 298/4తో నిలిచి భారీ స్కోరు చేసేలా క‌నిపించింది.

ENG vs IND : వామ్మో పంత్ మామూలోడు కాదు.. గ‌వాస్క‌ర్ ముచ్చ‌ట ప‌డి అడిగినా చేయ‌లేదు.. కానీ..

అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో లాగానే ఆఖ‌రిలో వ‌రుస‌గా వికెట్లు చేజార్చుకుంది. 31 ప‌రుగుల వ్య‌వ‌ధిలో ఆరు వికెట్లు కోల్పోయింది. రీ ఎంట్రీ క‌రుణ్ నాయ‌ర్ (20) మ‌రోసారి విఫ‌లం కాగా.. శార్దూల్ ఠాకూర్ (4), సిరాజ్‌(0), బుమ్రా (0)లు కూడా విఫ‌లం కావ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ 364 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

బౌల‌ర్లు ఏం చేస్తారో..
భార‌త్ విజ‌యం సాధించాలంటే బౌల‌ర్లు రాణించాల్సిందే. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అయిన‌ప్ప‌టికి అత‌డికి మిగిలిన బౌల‌ర్ల నుంచి పెద్ద‌గా మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. ఇక ఫీల్డ‌ర్లు కూడా క్యాచ్‌లు మిస్ చేయ‌డంతో భార‌త్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పెద్ద‌గా ల‌భించ‌లేదు.

Rishabh Pant : చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌.. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచ‌రీలు బాదిన ఏకైక భార‌త వికెట్ కీప‌ర్..

క‌నీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా బుమ్రాతో పాటు సిరాజ్, ర‌వీంద్ర జ‌డేజా, శార్దూల్ ఠాకూర్‌లు స‌త్తా చాటితే తొలి టెస్టులో విజ‌యం సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.