India Player Sreesanth: రంజీ మ్యాచ్‌లు ఆడనున్న శ్రీశాంత్.. తొమ్మిదేళ్ల విరామం తర్వాత
టీమిండియా మాజీ ఫేసర్ ఎస్ శ్రీశాంత్ రంజీ మ్యాచ్ లు ఆడేందుకు సెలక్ట్ అయ్యాడు. 24మందితో కూడిన బృందంలో ఒకడయ్యేందుకు తొమ్మిదేళ్ల సమయం పట్టింది. శ్రీశాంత్ చివరిసారిగా 2013లో ఇరానీ కప్ టో

Sreesanth
India Player Sreesanth: టీమిండియా మాజీ ఫేసర్ ఎస్ శ్రీశాంత్ రంజీ మ్యాచ్ లు ఆడేందుకు సెలక్ట్ అయ్యాడు. 24మందితో కూడిన బృందంలో ఒకడయ్యేందుకు తొమ్మిదేళ్ల సమయం పట్టింది. శ్రీశాంత్ చివరిసారిగా 2013లో ఇరానీ కప్ టోర్నమెంట్ కు ఆడాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఏడేళ్ల నిషేదాన్ని అనుభవించాడు.
ఈ మేరకు ఆదివారం తన ట్విట్టర్ అకౌంట్ లో .. ‘తొమ్మిదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సెలక్ట్ అవడం చాలా సంతోషంగా ఉంది. నా రాష్ట్రం తరపున ఆడే అవకాశం ఇచ్చిన ప్రతిఒక్కరికీ చాలా ప్రేమ, గౌరవంతో కూడిన థ్యాక్స్ చెబుతున్నా’ అంటూ రాసుకొచ్చాడు.
స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై బోర్డు నిషేదాన్ని విధించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు.
rEAD aLSO: ఒకే స్కూళ్లో 52మందికి కొవిడ్ పాజిటివ్
శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్నాడు.