Shikhar Dhawan: అర్ధరాత్రి వేళ శిఖర్ ధావన్ చేసిన పనికి అంతా షాక్.. ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు

శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో నిత్యం పోస్టులు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఎక్కువగా క్రికెట్ కు సంబంధించిన ..

Shikhar Dhawan

Shikhar Dhawan: భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్ లలో శిఖర్ ధావన్ ఒకరు. అతన్ని గర్బర్ అనికూడా పిలుస్తారు. అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. తాజాగా అర్ధరాత్రి వేళ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ అవుతుంది. ఈ పోస్టును చూసిన నెటిజన్లు శిఖర్ ధావన్ కు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు. ఆయన అభిమానులు ఆందళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ధావన్ పోస్టులో ఏమని రాశారంటే.. నిద్రపట్టడం లేదు.. సాయం చేయండి అంటూ పేర్కొన్నాడు.

Also Read: INDW vs NZW : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు షాక్‌.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ విజ‌యం

శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో నిత్యం పోస్టులు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఎక్కువగా క్రికెట్ కు సంబంధించిన వీడియోలు, డ్యాన్స్ వీడియోలు, వర్కౌట్ వీడియోలను పోస్టు చేస్తుంటాడు. గత రెండు రోజుల క్రితం తన ట్విటర్ ఖాతాలో శిఖర్ ధావన్ ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. అందులో మెడిటేషన్ చేస్తుండగా.. ఓ కన్ను మూసి.. ఓ కన్ను తెరిచి ఉంచాడు. దీనికి.. ఒకవైపు దృష్టి.. మరోవైపు.. ఏం జరుగుతుంది..? అంటూ పేర్కొన్నాడు. తాజాగా శిఖర్ ధావన్ చేసిన పోస్టుకు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అతనికి కొందరు సానుభూతి తెలుపుతూ.. నిద్ర పట్టేందుకు సలహాలు ఇస్తుండగా.. మరికొందరు నెటిజన్లు ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

Also Read: IND vs NZ : ఏడు వికెట్ల‌తో విజృంభించిన వాషింగ్ట‌న్ సుంద‌ర్‌.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 259 ఆలౌట్‌

శిఖర్ ధావన్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో మంచి రికార్డులను సాధించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేశాడు. పదమూడేళ్లు అంతర్జాతీయ క్రికెట్ లోకొనసాగాడు. టెస్టుల్లో 34 టెస్టులు ఆడిన అతను.. 2,315 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఐదు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. 167 వన్డేలు ఆడిన ధావన్.. 6,793 పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 39 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్ లో 68 మ్యాచ్ లు ఆడి 1,759 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ధావన్ రాణించాడు. 222 మ్యాచ్ లు ఆడిన అతను 6,769 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 51 ఆఫ్ సెంచరీలుఉన్నాయి. చివరిసారిగా 2022 డిసెంబర్ లో శిఖర్ ధావన్ బంగ్లాదేశ్ తో వన్డేలో మ్యాచ్ లో ఆడాడు.