INDW vs NZW : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు షాక్‌.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ విజ‌యం

మూడు వ‌న్డేల మ్యాచ్ సిరీస్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు శుభారంభం చేసింది.

INDW vs NZW : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు షాక్‌.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ విజ‌యం

India Women won by 59 runs in first ODI against New Zealand Women

Updated On : October 24, 2024 / 9:17 PM IST

India Women vs New Zealand : మూడు వ‌న్డేల మ్యాచ్ సిరీస్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు శుభారంభం చేసింది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో 59 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 228 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కివీస్ 40.4 ఓవ‌ర్ల‌లో 168 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది.

కివీస్ బ్యాట‌ర్ల‌లో బ్రూక్ (39), మ్యాడీ గ్రీన్‌ (31), ఔరెన్ (26), అమేలియా కెర్ (25), జార్జియా ప్లిమ్మర్ (25) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో రాధా యాద‌వ్ మూడు వికెట్లు తీసింది. సైమా ఠాకూర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది. దీప్తి శ‌ర్మ‌, అరుంధ‌తిలు చెరో వికెట్‌ను సాధించారు.

IND vs NZ : ముగిసిన తొలి రోజు ఆట‌.. రోహిత్ శ‌ర్మ డ‌కౌట్‌.. 243 ప‌రుగులు వెన‌క‌బ‌డిన భార‌త్‌

అంత‌క‌ముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త జ‌ట్టు 44.3 ఓవ‌ర్ల‌లో 227 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో తేజల్ హ‌స‌బ్నిస్ (42), దీప్తి శ‌ర్మ (41), య‌స్తికా భాటియా (37), జెమీమా రోడ్రిగ్స్ (35), షెఫాలీ వ‌ర్మ (33) లు రాణించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో అమేలియా కౌర్ నాలుగు వికెట్లు తీసింది. జెస్ కెర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది. కార్స‌న్ రెండు, సుజీ జేట్స్ ఓ వికెట్ సాధించారు.

ఈ మ్యాచ్‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ దూరం కావ‌డంతో స్మృతి మంధాన నాయ‌క‌త్వం వ‌హించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోతుంది.

IND vs NZ : నేను ఔటైయ్యానా.. ర‌చిన్ ర‌వీంద్ర ఫ్యూజులు ఔట్‌.. సుంద‌ర్ సూప‌ర్ బౌలింగ్‌..