Sreesanth : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో తీవ్ర విషాదం..
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ (Sreesanth) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
- Thota Vamshi Kumar
- Published on- September 12, 2026 / 02:57 PM IST
Former indian cricketer Sreesanth father shanthakumaran nair passes away
Sreesanth : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శాంతకుమారన్ నాయర్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్వగ్రామమైన కోతమంగళంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
శాంతకుమారన్ నాయర్ ఎల్‌ఐసీలో జోనల్ మేనేజర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. శాంతకుమారన్, సావిత్రి దేవి దంపతులకు నలుగురు సంతానం. వీరితో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆఖరి సంతానం.
శాంతకుమారన్ నాయర్ మృతి పట్ల బంధువులు, సన్నిహితులు, పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం తెలియజేస్తున్నారు.
