Jonty Rhodes
Jonty Rhodes : సౌతాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ బెంగళూరు వచ్చారు. లోకల్ టాక్సీ డ్రైవర్‌కి థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అసలేంటి కథ? అంటే..
జాంటీ రోడ్స్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ, గోవా అంటూ తిరుగుతున్నారు. అలా బెంగళూరుకు వచ్చిన జాంటీ రోడ్స్‌కి భలే అనుభవం ఎదురైంది. బెంగళూరు సిటీ అంటే ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంగళూరు ఎయిర్ పోర్టు దగ్గరలో టాక్సీలో ఉన్న సమయంలో రోడ్స్‌కి ఆకలి వేసినట్లుంది. ట్రాఫిక్‌లో ఎక్కడ పడితే అక్కడ ఆపడం అంటే డ్రైవర్లకు ఇబ్బందే. పైగా సిటీకి కొత్తగా వచ్చిన వారికి అక్కడి పరిస్థితులపై పెద్దగా అనుభవం ఉండదు. దాంతో రోడ్స్ ఎక్కిన టాక్సీ డ్రైవర్ వెళ్లే దారిలో తనకి ఇష్టమైన రెస్టారెంట్‌లో ఆగుదామని సలహా ఇచ్చాడు. రోడ్స్ సరే అన్నారు.
టాక్సీ డ్రైవర్ చూపించిన రెస్టారెంట్‌లో ఫుడ్ తిన్నారు జాంటీ రోడ్స్. అంతేనా అవి ఎంతో రుచికరంగా ఉన్నాయంటూ డ్రైవర్‌కి థ్యాంక్స్ చెప్పడమే కాదు.. తనకు ఎంతో రుచికరమైన ఫుడ్ పరిచయం చేసావంటూ పొగిడేశారు. ఇక ఆ రెస్టారెంట్ సిబ్బందితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జాంటీ రోడ్స్. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
‘బెంగళూరు ఎయిర్ పోర్టు దగ్గరలో టాక్సీ డ్రైవర్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్లేదారిలో రోడ్‌సైడ్ రెస్టారెంట్‌లో కొద్దిసేపు ఆగుదామని చెప్పాడు.. అతని ఆలోచన నాకు నచ్చింది. ఎంతో రుచిగల మంగళూరు బన్, మైసూర్ మసాల దోశ, మసాలా చాయ్ రుచి చూసాను’ అని శీర్షికతో ‘ఐ లవ్ ఇండియా’ అనే హ్యాష్ టాగ్‌తో జాంటీ రోడ్స్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
India vs Australia : ఆసీస్‌తో టీ20 సిరీస్.. చాహల్‌కు దక్కని చోటు.. లెగ్ స్పిన్నర్ రియాక్షన్ చూశారా?
జాంటీ రోడ్స్ పోస్టుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘భారత్ మీద జాంటీ రోడ్స్ చాటుకున్న అభిమానం అద్భుతం.. నువ్వు లెజెండ్’ అంటూ కామెంట్లు పెట్టారు. 1992 లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన జాంటీ రోడ్స్ టాప్ ఫీల్డర్‌గా ఎదిగారు. తన కెరియర్‌లో 52 టెస్టులు, 245 వన్డేలు ఆడారు.
When taxi driver at Bengaluru airport suggested to stop at his favourite restaurant for a roadside bite, because according to him: “traffic will be standing!” Grateful I took his advice. Excellent #mangalorebun and #Mysoremasaldosa, finished off with #masalachai #loveIndia pic.twitter.com/tH3KjykLUI
— Jonty Rhodes (@JontyRhodes8) November 21, 2023