Rohit Sharma : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు..

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను అరుదైన రికార్డు ఊరిస్తోంది.

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. భార‌త కాల‌మానం ప్రకారం జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ శ‌ర్మ బ‌రిలోకి దిగితే ఈ అద్భుత రికార్డు అత‌డి సొంత‌మ‌వుతుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభ ఎడిష‌న్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్నీ ఎడిష‌న్ల‌లో ఆడిన ఏకైక టీమ్ఇండియా ఆట‌గాడిగా హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు.

2007లో ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా మొద‌టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రిగింది. ఈ టోర్నీలో భార‌త జ‌ట్టు టీ20ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రోసారి భార‌త్ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వ‌లేదు. ధోని సార‌థ్యంలో ఆ మెగాటోర్నీలో ఆడిన భార‌త జట్టులో రోహిత్ శ‌ర్మ స‌భ్యుడిగా ఉన్నాడు. ఆ త‌రువాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ప్ర‌పంచ‌క‌ప్‌లు జ‌ర‌గ‌గా అన్నీ ఎడిష‌న్ల‌లో రోహిత్ శ‌ర్మ టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు.

ICC T20 rankings : ఐసీసీ ర్యాంకుల్లో టీమ్ఇండియా కుర్రాళ్ల మెరుపులు..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ మాత్ర‌మే ఇలాంటి ఘ‌న‌త‌ను క‌లిగి ఉన్నాడు. రోహిత్‌, ష‌కీబ్ మిన‌హా మ‌రే క్రికెట‌ర్ కూడా అన్నీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడ‌లేదు. కాగా.. వీరిద్ద‌రు 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తోనే త‌మ త‌మ కెరీర్‌ల‌ను ప్రారంభించ‌డం విశేషం.

ఇక రోహిత్ విష‌యానికి వ‌స్తే.. గ‌త 8 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచుల్లో 34.39 స‌గ‌టు 127.88 స్ట్రైక్‌రేటుతో 963 ప‌రుగులు చేశాడు. ష‌కీబ్ 36 మ్యాచుల్లో 23.93 స‌గ‌టు, 122.44 స్ట్రైట్‌రేటుతో 742 ప‌రుగులు చేశాడు.

Team India Head Coach : టీమ్ఇండియా కొత్త కోచ్‌ రేసులో ట్విస్ట్‌..?

అమెరికా, వెస్టిండీస్ దేశాలు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగాటోర్నీలో భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు