Team India Head Coach : టీమ్ఇండియా కొత్త కోచ్‌ రేసులో ట్విస్ట్‌..?

టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత ముగియ‌నుంది.

Team India Head Coach : టీమ్ఇండియా కొత్త కోచ్‌ రేసులో ట్విస్ట్‌..?

New India Coach Appointment May Be Postponed Report

India Head Coach : టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో అత‌డి స్థానంలో ఎవ‌రు వ‌స్తారు అన్న చ‌ర్చ మొద‌లైంది. ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడ‌ని మొద‌ట ప్ర‌చారం జ‌రిగింది. కాగా.. ల‌క్ష్మణ్ ఇందుకు సిద్ధంగా లేడ‌ని తెలిసింది. అయితే.. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్ గౌత‌మ్ గంభీర్ టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా ఎంపిక అయ్యాడ‌ని, ప్ర‌క‌ట‌నే త‌రువాయి అని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌రువాత గంభీర్‌తో బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా చాలా సేపు ఒంట‌రిగా మాట్లాడ‌డం ఈ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది. తాజాగా కోచ్ రేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అస‌లు గంభీర్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడో లేదో అనే విష‌యం పై స్ప‌ష్ట‌త లేద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కోచ్ ఎంపిక విధానాన్ని బీసీసీఐ ఆల‌స్యం చేస్తుంద‌ని పేర్కొంది.

Babar Azam : ‘నా ద‌గ్గ‌రికి రావొద్దు.. దూరంగా వెళ్లండి..’ ఫ్యాన్స్ పై చిర్రుబుర్రులాడిన బాబ‌ర్ ఆజాం.. వీడియో

హెడ్‌కోచ్ ప‌ద‌వి కోసం అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తు గ‌డువు మే27తో ముగిసింది. ప్ర‌స్తుతం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పై దృష్టి సారించ‌డంతో ఈ మెగాటోర్నీ ముగిసిన త‌రువాతే కోచ్ ఎంపిక ప్ర‌క్రియ‌పై దృష్టి సారించాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లుగా పీటీఐ నివేదిక పేర్కొంది. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన వెంట‌నే టీమ్ఇండియా శ్రీలంక‌, జింబాబ్వేకు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌ల‌కు సీనియ‌ర్ల‌కు విశ్రాంతి ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. తాత్కాలిక కోచ్‌తో ఈ ప‌ర్య‌ట‌న‌ను నెట్టుకురావొచ్చున‌ని అనుకుంటుంద‌ట‌.

‘గడువు బాగానే ఉంది. కానీ బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చే ముందు మరికొంత సమయం తీసుకున్నా పట్టించుకోవాల్సిన ప‌ని లేదు. ప్రస్తుతం జూన్ నెలలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పైనే దృష్టిసారించాం. ఆ తర్వాత శ్రీలంక, జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌ల‌కు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వ‌నున్నారు. ఎన్‌సీఏ ఆధారిత సీనియర్ కోచ్‌లలో ఎవరైనా జట్టుతో పాటు వెళ్లవచ్చు, కాబట్టి కోచ్‌ను వెంట‌నే ఎంపిక చేయాల్సిన తొంద‌రేం లేదు.’అని బీసీసీఐ మూలం పీటీఐ కి తెలిపింది.

MS Dhoni : టీమ్ఇండియా కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ధోని అర్హుడు కాదా? ఎందుకంటే?