ICC T20 rankings : ఐసీసీ ర్యాంకుల్లో టీమ్ఇండియా కుర్రాళ్ల మెరుపులు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్లు దుమ్ములేపారు.

ICC T20 rankings : ఐసీసీ ర్యాంకుల్లో టీమ్ఇండియా కుర్రాళ్ల మెరుపులు..

ICC T20 rankings Arshdeep and Axar get much needed boost before T20 World Cup

ICC T20 rankings : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్లు దుమ్ములేపారు. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్ లు త‌మ త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ఏకంగా 16 స్థానాలు పైకి ఎగ‌బాక‌గా, అక్ష‌ర్ ప‌టేల్ ఓ స్థానం ఎగ‌బాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు ఆదిల్ ర‌షీద్ మొద‌టి స్థానంలో ఉన్నాడు.

ఐసీసీ టీ20 మెన్స్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌..

ఆదిల్‌ రషీద్ (ఇంగ్లాండ్‌) – 722 రేటింగ్‌ పాయింట్లు
వనిందు హసరంగ (శ్రీలంక) – 687 రేటింగ్‌ పాయింట్లు
అక్షర్‌ పటేల్ (భార‌త్‌) – 660 రేటింగ్‌ పాయింట్లు
మహీశ్‌ తీక్షణ (శ్రీలంక) – 659 రేటింగ్‌ పాయింట్లు
రవి బిష్ణోయి (భార‌త్‌) – 659 రేటింగ్‌ పాయింట్లు

Team India Head Coach : టీమ్ఇండియా కొత్త కోచ్‌ రేసులో ట్విస్ట్‌..?

సూర్య‌కు ఎదురులేదు..

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విభాగంలో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. 861 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతున్నాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా ఫిల్ సాల్ట్‌, మ‌మ్మ‌ద్ రిజ్వాన్‌, బాబ‌ర్ ఆజాం, మార్‌క్ర‌మ్‌లు ఉన్నారు. ఇక టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఓ స్థానం పైకి ఎగ‌బాకి 714 రేటింగ్ పాయింట్ల‌తో ఆరో స్థానానికి చేరుకున్నాడు.

ఐసీసీ మెన్స్‌ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌..

సూర్యకుమార్‌ యాదవ్ (భార‌త్) – 861 పాయింట్లు
ఫిల్‌ సాల్ట్ (ఇంగ్లాండ్‌) – 788 పాయింట్లు
మహ్మద్‌ రిజ్వాన్ (పాకిస్తాన్‌) – 769 పాయింట్లు
బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌) – 761 పాయింట్లు
ఐడెన్‌ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) – 733 పాయింట్లు

Babar Azam : ‘నా ద‌గ్గ‌రికి రావొద్దు.. దూరంగా వెళ్లండి..’ ఫ్యాన్స్ పై చిర్రుబుర్రులాడిన బాబ‌ర్ ఆజాం.. వీడియో