Gambhir and Rohit told me they are considering me for red ball Sanju Samson
Sanju Samson : టీ20ల్లో టీమ్ఇండియా తరుపున వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా సంజూ శాంసన్ రికార్డులకు ఎక్కాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచులో అతడు ఈ రికార్డును అందుకున్నాడు. దీంతో అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తనకు అందివచ్చిన అవకాశాలను ఎట్టకేలకు న్యాయం చేశాడని అంటున్నారు.
తనకు పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టుల్లోనూ ఆడాలని ఉందని సంజూ శాంసన్ తన మనసులోని కోరికను వెల్లడించాడు. టెస్టుల్లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లు చెప్పినట్లు తెలిపాడు. అయితే.. అంతకముందు మరిన్ని రంజీట్రోఫీ మ్యాచులు ఆడాలని సూచించారని వెల్లడించాడు.
IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్
‘టెస్టుల్లో రాణించగలననే నమ్మకం నాకు ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కావాలని నేను అనుకోవడం లేదు. టీమ్ఇండియా తరుపున టెస్టు క్రికెట్ ఆడాలనేది నా కోరిక.’ అని సంజూ శాంసన్ చెప్పాడు. ‘గత దులీప్ ట్రోఫీకి ముందే టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి ఓ సందేశం వచ్చింది. నన్ను కూడా టెస్టుల్లోకి పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అయితే అందుకోసం మరిన్ని రంజీ మ్యాచ్‌లు ఆడాలని సూచించారు.’ అని శాంసన్ తెలిపాడు.
టీ20ల్లో సెంచరీ పై స్పందిస్తూ..
కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన మద్దతుతోనే టీ20ల్లో శతకం చేయగలిగినట్లు సంజూ శాంసన్ తెలిపాడు. శ్రీలంక సిరీస్‌లో విఫలం కావడంతో రాజస్థాన్ అకాడమీ వెళ్లిపోయాను. అక్కడ రాహుల్ ద్రవిడ్, జుబిన్ భరుచా సమక్షంలో ట్రైనింగ్ తీసుకున్నాను. దులీప్ ట్రోఫీలో సెంచరీతో రాణించడం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. ఆ టోర్నీలో దేశంలోనే అత్యుత్తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. అని సంజూ శాంసన్ తెలిపాడు.
PAK vs ENG : బంతిని ఇలా కూడా షైన్ చేయొచ్చా.. స్పిన్నర్ బట్టతలపై బంతిని రుద్దిన జోరూట్.. వీడియో