IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్
డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై భారత్ జట్టు కన్నేసింది. టీమిండియా ఇంకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో న్యూజిలాండ్ తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

India vs New Zealand Test Series 2024
IND vs NZ Test Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రాంరభం కానుంది. కుర్రాళ్లు, సీనియర్ల మేలు కలయికతో అన్ని విభాగాల్లో దుర్భేధ్యంగా టీమిండియా కనిపిస్తోంది. మరోవైపు శ్రీలంక చేతిలో ఓటమితో సన్నగిల్లిన విశ్వాసంతో న్యూజిలాండ్ ఈ సిరీస్ లో అడుగుపెడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై కన్నేసిన భారత్ జట్టు.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇవాళ ప్రారంభం కానున్న తొలి మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.
బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులుసైతం ఇచ్చారు. భారీ వర్షం వల్ల మంగళవారం రోహిత్ సేన ప్రాక్టీస్ సెషన్ కూడా నిలిచిపోయింది. అయితే, మ్యాచ్ వేదిక చిన్నస్వామి స్టేడయంలో డ్రైనేజ్ సౌకర్యం బాగుండటంతో వర్షం తగ్గిన కొద్దిసేపటికే మ్యాచ్ ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. అయితే, వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రెండు రోజులు బెంగళూరులో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుందని పేర్కొంది. అదేజరిగితే ఇవాళ, రేపు మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు.
Also Read: IND vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు భారత్‌కు షాక్.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఛాన్స్?
టెస్ట్ ఫార్మాట్ లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియాదే పైచేయి. స్వదేశంలో న్యూజిలాండ్ తో భారత్ జట్టు 12 టెస్టు సిరీస్ లు ఆడింది. పది సిరీస్ లను భారత్ గెలుచుకుంది. రెండు డ్రా అయ్యాయి. కివీస్ ఒక్కసారికూడా సిరీస్ గెలవలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్ తో భారత జట్టు 36 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో 17 మ్యాచ్ లలో విజయం సాధించగా.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. 17 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. మొత్తానికి న్యూజిలాండ్ జట్టు ఇప్పటి వరకు భారత్ లో ఒక్కసారికూడా టీమిండియాపై టెస్టు మ్యాచ్ గెలవలేదు. అయితే, ఈసారి టెస్టు మ్యాచ్ లో భారత్ ను ఓడించాలని న్యూజిలాండ్ జట్టు పట్టుదలతో ఉంది. అయితే, కివీస్ ఆటగాళ్లు సరియైన ఫామ్ లో లేని నేపథ్యంలో బలమైన భారత్ జట్టును ఏ విధంగా నిలువరిస్తుందోననే అంశం ఆసక్తికరంగా మారింది.
Also Read: Virat Kohli : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. అరుదైన రికార్డు పై విరాట్ కోహ్లీ కన్ను..
డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై భారత్ జట్టు కన్నేసింది. టీమిండియా ఇంకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో న్యూజిలాండ్ తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ ఎనిమిది టెస్ట్ మ్యా చ్ లలో రోహిత్ సేన ఐదు మ్యాచ్ లు గెలిస్తే ఎలాంటి సందిగ్దతకు తావులేకుండా నేరుగా ఫైనల్లో చోటు సంపాదిస్తుంది. అదే సమయంలో కనీసం మూడు గెలిచినా అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరిగే మూడు టెస్టు మ్యాచ్ లలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని, తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది.