IND vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు భార‌త్‌కు షాక్‌.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు ఛాన్స్‌?

న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది.

IND vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు భార‌త్‌కు షాక్‌.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు ఛాన్స్‌?

Shubman Gill doubtful for 1st test against New zealand

Updated On : October 15, 2024 / 5:35 PM IST

IND vs NZ 1st test : న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ బెంగ‌ళూరులో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది. గిల్ మెడ‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అత‌డు ఫిజియో ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని జాతీయ మీడియా తెలిపింది.

రేపు (బుధవారం) మ్యాచ్ ప్రారంభానికి ముందు వ‌ర‌కు అత‌డు కోలుకోక‌పోతే అత‌డి స్థానాన్ని స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌తో భ‌ర్తీ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా.. గిల్ గాయంపై బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇటీవ‌ల ఇరానీ క‌ప్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ బాదాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక అయిన‌ప్ప‌టికి అత‌డికి తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశం రాలేదు.

Virat Kohli : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. అరుదైన రికార్డు పై విరాట్ కోహ్లీ క‌న్ను..

ఇక ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచు సాగే ఐదు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ వాఖ తెలియ‌జేసింది. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి బెంగ‌ళూరులో భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో టీమ్ఇండియా ప్రాక్టీస్ సెష‌న్ సైతం రద్దు చేశారు.

ఇదిలా ఉంటే.. భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 62 టెస్టుల్లో త‌ల‌ప‌డ్డాయి. భార‌త్ 22 టెస్టుల్లో గెల‌వ‌గా న్యూజిలాండ్ 13 మ్యాచుల్లో విజ‌యం సాధించింది. 27 మ్యాచులు డ్రాగా ముగిశాయి.

IND vs NZ 1st Test : బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ తొలి టెస్టు.. టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌

కాగా.. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్‌ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో.. మూడో మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నాయి.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భార‌త జ‌ట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.